Badminton Tragedy : బ్యాడ్మింటన్ విషాదం.. ఆడుతూనే చైనా ప్లేయర్ మృతి
Badminton Tragedy : ఇండోనేషియా బ్యాడ్మింటన్ టోర్నీలో విషాదం చోటు చేసుకుంది. బ్యాడ్మింటన్ ఆడుతూనే చైనాకు చెందిన 17 ఏళ్ల ఆటగాడు ఝాంగ్ జిజియీ హార్ట్ ఎటాక్ కు గురయ్యాడు. ఆట ప్రారంభమైన కాసేపటికే బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలిపోయి మృతి చెందాడు. కోచ్, తోటి ఆటగాళ్లు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటనతో చైనా క్రీడా ప్రపంచం శోక సముద్రంలో మునిగిపోయింది.
యోగ్యకార్తాలో జరుగుతున్న ఆసియా జూనియర్ ఛాంపియన్ షిప్ లో ఝాంగ్ జిజీ అకస్మాత్తుగా మృతి చెందాడు. జపాన్ కు చెందిన కజుమా కవానోతో మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఆదివారం (జూన్ 30) అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. అధికారులు అతని మృతికి సంతాపం తెలిపారు. జాంగ్ కుటుంబానికి భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ‘ఎక్స్’లో పోస్టు చేసింది.