Wine shops : మద్యం ప్రియులకు ఇది కాస్త చేదు వార్తే. హైదరాబాద్ నగరంలో ఆది, సోమవారాల్లో వైన్ షాపులు మూసివేయనున్నారు. మహంకాళి బోనాల పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ వ్యాప్తంగా నాన్ ప్రొప్రైటరీ క్లబ్బులు, స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు, వైన్ షాపులను బంద్ చేస్తామని సీపీ కోట శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. జూలై 28వ తేదీ ఉదయం 6 గంటల నుంచి రెండు రోజుల పాటు అన్ని వైన్ షాపులు మూతబడనున్నాయి. చాంద్రాయణగుట్ట, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు అంటే సోమవారం సాయంత్రం వరకు మద్యం దుకాణాలు మూసి ఉంటాయని తెలిపారు. సౌత్ జోన్‌లోని చార్మినార్, హుస్సేనీ ఆలం, ఫలక్ నుమా, మొగల్‌పురా, చైటినాక, సాలిబండ, మీర్‌చౌక్, డబ్బిర్‌పురా ప్రాంతాల్లో 28వ తేదీ ఉదయం 6 గంటల నుంచి రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు, వైన్‌షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు, మద్యం దుకాణాలు మూసివేయబడతాయని నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అంతే కాకుండా కల్లు దుకాణాలను కూడా మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్తర్వులు 30వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయని తెలిపారు. ఆషాడమాసం ప్రారంభం నుంచి నగరంలో బోనాల పండుగ జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో శ్రీ మహంకాళి లాల్ దర్వాజ బోనాల పండుగ సందర్భంగా అంబారీపై అమ్మవారి ఊరేగింపు జరగనుంది. పాతబస్తీలోని వివిధ ప్రాంతాల గుండా ప్రయాణం కొనసాగుతుంది. ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. వాహనాలను కూడా ఆయా మార్గాల్లో మళ్లిస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. పాతబస్తీలోని వివిధ ప్రాంతాల గుండా ప్రయాణం కొనసాగుతుంది. వాహనాలను కూడా ఆయా మార్గాల్లో మళ్లిస్తామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. లాల్ దర్వాజ బోనాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ సిటీ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అన్ని రకాల వైన్ షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం జూలై 28 (ఆదివారం) ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తుంది.