Zimbabwe vs India : క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. జింబాబ్వే వర్సెస్ ఇండియా లైవ్ చూడాలంటే కష్టమే

Zimbabwe vs India

Zimbabwe vs India

Zimbabwe vs India : భారత క్రికెట్ ఫ్యాన్స్ కు ఒక బ్యాడ్ న్యూస్. జింబాబ్వే తో అయిదు టీ 20 ల మ్యాచ్ ల సిరీస్ ఆడేందుకు టీం ఇండియా జింబాబ్వే కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచులు టీవీలో మాత్రమే ఫ్రీ చూసేందుకు అవకాశం కల్పించారు. మ్యాచులు చూసేందుకు ఫోన్లలో ఫ్రీ సబ్క్రిప్షన్ లేదు. ఈ సిరీస్ కు సోనీ లివ్ అనే టీవీ చానల్ హక్కులు తీసుకుంది.

టీవీలో ఫ్రీ గా ప్రసారం చేస్తున్న ఈ టీవీ చానల్ ఫోన్ లో మాత్రం ఫ్రీ గా ఇవ్వడం లేదు. దీంతో భారత క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చానల్స్ కు హక్కులు ఇవ్వకూడదని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రోజు సాయంత్రం మొదటి టీ 20 ప్రారంభం కానుండగా..  ఈ మ్యాచులను మొబైల్ లో చూడాలంటే సోని లివ్ ను సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. దీని కోసం సోని రూ. 399 నుంచి 1499 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది.

ఇప్పటికే చాలా మంది మొబైల్స్ వాడేవారు ఎన్నో యాప్స్ ను ఇలా సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వారు ఉన్నారు. ఇప్పుడు మళ్లీ దీన్ని కూడా తీసుకోవాలా అని నిట్టూరుస్తున్నారు. సోమవారం జులై ఆరు సాయంత్రం 4.30 కు మొదటి టీ 20 మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఈ సిరీస్ కు కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ను ఎంపిక చేశారు. రుత్ రాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, యశస్వి జైశ్వాల్ ఇంతకుముందే టీం ఇండియాకు ఆడిన ప్లేయర్లు కాగా.. అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా లాంటి వారికి మొదటి సారి టీం ఇండియాలో చోటు దక్కింది. నితీశ్ కుమార్ రెడ్డికి కూడా చాన్స్ రాగా.. గాయం వల్ల జట్టులో చేరలేకపోయాడు. దీంతో హర్షిత్ రాణాను ఎంపిక చేశారు.

TAGS