Baby Real Story : ‘బేబీ’ మూవీ ఆ కాకినాడ అమ్మాయి నిజ జీవితాన్ని ఆధారంగా తీసుకొని చేశారా?
Baby Real Story : గత ఏడాది యూత్ ఆడియన్స్ ని ఉర్రూతలూ ఊగించిన చిత్రాలలో ఒకటి ‘బేబీ’. ‘కలర్ ఫోటో’ సినిమా నిర్మాత సాయి రాజేష్ దర్శకుడిగా మారి, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ని హీరో గా, ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య ని హీరోయిన్ గా పెట్టి తీసిన ఈ చిత్రం 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. పెట్టి ప్రతీ పైసాకి పదింతలు లాభాన్ని తెచ్చిపెట్టిన అతి తక్కువ సినిమాలలో ఇది కూడా ఒకటి.
ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు తమ జీవితం లో జరిగిన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ని గుర్తు తెచుకోక తప్పదు. ఎందుకంటే ఈ సినిమా సాయి రాజేష్ యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకొనే తెరకెక్కించాడట. ఈ చిత్రం లో హీరోయిన్ స్వచ్ఛమైన ప్రేమని కోరుకుంటుంది, కానీ ఒక పార్టీ లో మందు తాగిన మైకంలో తన స్నేహితుడితో వేసిన చిన్న తప్పటడుగు వల్ల ఆమె ఎంతో మానసిక వేదనకి గురి అవుతుంది.
ఆ తర్వాత తన స్నేహితుడు బ్లాక్ మెయిల్ చెయ్యడం తో ప్రియుడికి తెలియకుండా తన శరీరాన్ని అర్పిస్తుంది. ఈ విషయాన్నీ తెలుసుకున్న ప్రియుడు ఆమెని దూరం పెట్టేస్తాడు, తెలియక జరిగిన పొరపాటు, దయచేసి నన్ను క్షమించు అని ఎంత బ్రతిమిలాడినా ఆ అమ్మాయిని క్షమించడు. చివరికి ఆ అమ్మాయికి కొన్నాళ్ళకు ఇంట్లో వాళ్ళు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు. అక్కడితో సినిమా కథ ముగుస్తుంది. అయితే ఇది నిజజీవితం లో కూడా కాకినాడ కి చెందిన మధులత అనే అమ్మాయికి జరిగిందట. ఈ సినిమాని చూస్తున్నంతసేపు తన జీవితాన్ని వెండితెర మీద చూసుకున్నట్టు అనిపించింది, సినిమా చూసి చాలా ఏడ్చేసాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
సాయి రాజేష్ ఇలా తన చుట్టూ జరిగిన సంఘటనలను ఆధారంగా తీసుకొనే సినిమాలు తీస్తున్నట్టుగా అనిపిస్తాది. ఇప్పుడు మళ్ళీ ఆయన ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య కాంబినేషన్ లో మరో సినిమా చేస్తున్నాడు. అయితే ఈసారి ఆయన కేవలం కథ మాత్రమే అందించాడు. దర్శకత్వం మాత్రం రవి నంబూరి అనే వ్యక్తి చేస్తున్నాడు. ఈ ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.