Babu Mohan : చిరంజీవినే 3 నెలలు వెయిట్ చేయించాను.. నా పరుపు దులిపితే కోట్లు రాలాయి..

Babu Mohan

Babu Mohan

Babu Mohan : టాలీవుడ్ లోని సీనియర్ కమేడియన్లలో బాబూ మోహన్ ఒకరు. బ్రహ్మానందానికి ధీటుగా కామెడీ పండించడంలో ఆయన ధిట్ట. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా భిన్న రకాల పాత్రలతో అలరించాడు. ఇక రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఆయన సినిమాలు చేయడం బాగా తగ్గించాడు. ‘ఆర్గానిక్ మామ.. హై బ్రీడ్ అల్లుడు’తో రీ ఎంట్రీ ఇచ్చాడు. సీనియర్ కమెడియన్ అయిన ఆయన ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించాడు.

3 నెలలు వెయిట్‌ చేయించా
‘ముఠా మేస్త్రీ’ సినిమా షూటింగ్ సమయంలో ఒక సంఘటన జరిగింది. కేవలం నా గురించే ఒక సీన్ మూడు నెలలు ఆగిపోయింది. చివరికి చిరంజీవికి విసుగెత్తింది. అసహనంతో ‘మీరేం చేస్తారో నాకు తెలియదు.. ఈ రోజో, రేపో షూటింగ్‌ కంప్లీట్ కావాలి. 2 గంటల సమయం ఎప్పుడిస్తారో చెప్పాలి. ఓ టైం ఫిక్స్‌ చేసి రావాలని చెప్పాలి’ అని అన్నాడు. టైం ఎప్పుడో చెప్తే వచ్చేందుకు ట్రై చేస్తా అన్నాను.. ‘ఇంకా ట్రై చేయడమేంటి?’ అని సీరియస్ అయ్యాడు. నేను సారీ చెప్పా.. చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో షూటింగ్‌ అంటే కూడా అంతకన్నా ఇష్టం. కానీ బిజీ షెడ్యూల్ వల్ల డేట్లు అడ్జస్ట్‌ కాలేదు.

ఓ పక్క సంతోషం.. మరోపక్క బాధ
ఇదంతా జరిగాక ఒక రోజు టైం అడ్జస్ట్‌ చేసుకొని షూటింగ్ జరుగుతున్న సారథి స్టూడియోలో అడుగుపెట్టా. చిరంజీవి వచ్చేదాకా చెట్టు కింద పడుకుందామని అనుకున్నా.. కానీ అప్పటికే చిరంజీవి అక్కడున్నారు. ‘షూటింగ్‌ నుంచి వచ్చావా..? నీ కళ్లే చెప్తున్నాయి.. సినిమా వాళ్ల జీవితం అంటే ఇంతే..’ అని బాధపడ్డాడు. బ్రష్‌ చేసుకోమని చెప్పి ఇంటి నుంచి దోసెలు తెప్పించాడు. నేను తింటుంటే చూసి సంతోషించాడు, బాధపడ్డాడు. నాకూ తినాలని ఉన్నా.. హీరోను కాబట్టి తినలేను కదా అని ఫీల్ కూడా అయ్యాడు.’ అని చెప్పుకొచ్చాడు.

రూ. కోటి ముంచాడు
తన ఆస్తి గురించి మాట్లాుడతూ ‘ఒక్కో సారి డబ్బులు మంచం కింద పెట్టి మర్చిపోయేవాడిని. ఒక రోజు నా బెడ్‌ షీట్‌ దులిపితే రూ.12 లక్షలు కింద పడ్డాయి. క్షణం తీరిక లేకుండా షూటింగ్ లలో గడిపేవాడిని. చాలా మంది నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టారు. చాలా చెక్కులు బౌన్స్‌ కూడా అయ్యేవి. పోనీలే అని వదిలేసేవాళ్లం. కోర్టుల చుట్టూ తిరిగే సమయం ఉండదు కదా? ఒకసారి నేను మేనేజర్‌ను పెట్టుకున్నా. కానీ అతడు రూ. కోటికి లెక్క చెప్పకుండా వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అన్నీ ఆర్థిక లావాదేవీలను నేనే చూసుకునేవాడిని’ అని చెప్పాడు బాబూ మోహన్.

TAGS