Babu Cases Chasing : ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై పలు కేసులు నమోదై విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో దాదాపు50 రోజులకు పైగా జైలులో ఉండి మధ్యంతర బెయిల్ పై చంద్రబాబు బయటికి వచ్చిన విషయం తెలిసిందే.
మధ్యంతర బెయిలు..
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో జైలులో ఉన్న చంద్రబాబుకు కోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. అయితే ఇది కూడా చంద్రబాబు ఆరోగ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పలు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది నవంబర్ 28 వరకు బెయిల్ గడువు ఉంది.
క్వాష్ పిటిషన్
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు జైలులో ఉండగానే ఆయ తరఫున న్యాయవాదులు సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ నెలాఖరుకు తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
రెగ్యులర్ పై విచారణ
ఇదే ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా చంద్రబాబు తరఫున న్యాయవాదులు దాఖలు చేశారు. హైకోర్టులో కొనసాగుతున్న బెయిల్ విచాణ ఈ నెల 15కి వాయిదా పడింది.
ఇసుక కుంభకోణం..మద్యం పాలసీ..
ఇసుక కుంభకోణం కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణ ఏపీ హైకోర్టులో ఈ నెల 22కు వాయిదా పడింది. ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ పై విచారణ సుప్రీంకోర్టులో పెండింగులోనే ఉంది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 30కు వాయిదా వేసింది. అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో చంద్రబాబు ఏ1 కాగా మరో 170 మంది ఉన్నారు. ఇక మద్యం విధానాల్లో అక్రమాలకు సంబంధించి సీఐడీ తాజాగా దాఖలు చేసిన కేసులో ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణ ఏపీ హైకోర్టులో ఈ నెల 21కు వాయిదా పడింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణ ఏపీ హైకోర్టులో నవంబర్ 22కు వాయిదా పడింది.
సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పేరిట ఆగస్టు 4న అన్నమయ్య జిల్లాకు చంద్రబాబు అంగళ్లు మీదుగా వెళ్తుండగా వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడడం, టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీకి చెందిన మొత్తం 179 మంది నేతలపై కురబలకోట మండలం ముదివేడు పోలీసులు కేసులు నమోదు చేశారు.
అందులో చంద్రబాబును ఏ-1గా చేర్చారు. హత్యాయత్నంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ అనంతరం కొందరికి బెయిల్ లభించింది. ఆ తర్వాత మరికొంతమందికి బెయిల్ మంజూరైంది.