Babar Azam : పాకిస్థాన్ క్రికెట్ టీం కెప్టెన్ బాబర్ ఆజంపై మాజీ పాక్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ తీవ్రంగా మండిపడ్డాడు. బాబర్ ఆజం కెప్టెన్ గా మాత్రమే విఫలం కాలేదు.. బ్యాటర్ గా కూడా దారుణంగా విఫలం అవుతున్నాడు. పెద్ద జట్లపై అతడి ఆడిన ఇన్సింగ్స్ లు ఏమీ గొప్పగాి లేవు. బీ, సీ, డీ టీంలతో ఆడితే గొప్ప ఆటగాడివి అయిపోవు. టీంను నడిపించడంలో ఫెయిల్ అయ్యావు.. జట్టులో స్నేహితులను నింపేశావు.
ఇంకా టీం ఎలా గెలుస్తుంది. కనీసం గెలవాలన్న ఆలోచన కూడా లేదు. ఇండియాపై 120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయారు. ఇంత కంటే దారుణం ఏమైనా ఉంటుందా.. 70 పరుగుల వరకు 2 వికెట్లే కోల్పోయిన పాక్.. 49 బంతులకు 49 పరుగులు చేయాల్సిన దశలో మ్యాచ్ లో వరుసగా వికెట్లు కోల్పోయి.. దారుణ ఓటమిని కూడగట్టుకుంది.
కెప్టెన్ గా బాబర్ ఆజం సగటు 27, స్టైక్ రేట్ 112 మాత్రమే. ఇలాంటి స్ట్రైక్ రేట్ తో టీ 20 వరల్డ్ కప్ కొట్టడం సాధ్యమేనా.. అని విమర్శించాడు. పాక్ ఫ్యాన్స్ ను నువ్వు మోసం చేస్తున్నావ్.. బాబర్ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించాడు. పాక్ తరఫున ఆడిన అహ్మద్ షెహజాద్ 2009 న అరంగ్రేటం చేశాడు. షెహజాద్ ఇప్పటి వరకు 13 టెస్టులు, 81 వన్డేలు, 59 టీ20 లు ఆడి 6 వేలకు పైగా పరుగులు చేశాడు.
బాబర్ ఆజం ఫామ్ కోల్పోవడం, జట్టు బ్యాటర్లు కూడా పెద్దగా రాణించకపోవడంతో పాక్ యూఎస్ఏపై ఓడిపోయింది. పాక్ స్టార్ బౌలర్లు ఉన్నా.. 160 పరుగుల లక్ష్యమే ఉండటంతో బౌలర్లు కూడా చివరి వరకు పోరాడారు. అయినా సూపర్ ఓవర్ లో ఓడిపోవాల్సి వచ్చింది. మహమ్మద్ అమిర్ సూపర్ ఓవర్ లో 18 పరుగులు ఇవ్వడంతో యూఎస్ఏపై ఓడిపోయింది. పాక్ క్రికెట్ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా తయారైంది. ఐర్లాండ్, యూఎస్ ఏ, జింబాబ్వే లాంటి జట్లపై ఓడిపోయి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. అండగా నిలవాల్సిన మాజీలు టీం పర్ఫామెన్స్ పై కామెంట్స్ చేస్తున్నారు.