Baba Sehgal : హైదరాబాద్ బిర్యానీపై బాబా సెహగల్ పాట.. అదిరిపోలా.. వైరల్ వీడియో
Baba Sehgal : బాబా సెహగల్ ఇండియన్ మ్యూజిక్ లో ర్యాప్ సాంగ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. 90లో బాబా సెహగల్ తన పాటలతో ఉర్రూతలూగించారు. 90వ దశకంలో బాలీవుడ్లో ఉదిత్ నారాయణ్, కుమార్ సాను వరకు సుఖ్విందర్ సింగ్ తదితరులూ సింగర్స్ చెలామణి అవుతున్నారు. అప్పుడు బాలీవుడ్ నుంచి ఎక్కువగా రోమాంటిక్ సాంగ్స్ వచ్చేవి. ప్రేక్షకులు ఆ తరహ పాటలకు అలవాటు పడిపోయారు. కానీ బాబా సెహగల్ రాకతో ఒక్కసారిగా బాలీవుడ్ మ్యూజిక్ ని మొత్తంగా మార్చేశారు. అప్పటి వరకు భారతీయ సంగీ పరిశ్రమ వినని, చూడని కొత్త మ్యూజిక్ ను పరిచయం చేశారు బాబా సెహగల్. బాలీవుడ్లో బాబా సెహగల్ ప్రవేశం మ్యూజిక్ దిశనే మార్చేసింది. కొత్త కొత్త ప్రయోగాలతో ర్యాప్ పాటలతో తనదైన శైలిలో ఉర్రూతలూగించారు. బాబా ప్రభావం ఎంతగా చూపిందంటే సినిమాలో ఒక్కపాటైనా ర్యాప్ సాంగ్ ఉండాలి అనేంతగా మారింది.
బాలీవుడ్ తో పాటు సౌత్
బాబా సెహగల్ బాలీవుడ్ తో పాటు సౌత్ సినిమాల్లోనూ ఆడిపాడాడు. తెలుగులో చిరంజీవి నటించిన రిక్షావోడు సినిమాలో రూప్ తేరా మస్తానా.. సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. చిరంజీవి స్టెప్పులకు, బాబా మ్యూజిక్ మ్యాజిక్ కు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. చాలా రోజుల తర్వాత పవన్ కల్యాన్ జల్సా సినిమాలో టైటిల్ సాంగ్ పాడి అదరగొట్టేశాడు. ఆ పాట సినిమాకు ఎంతో ప్లస్ అయ్యింది.
హైదరాబాద్ బిర్యానీపై పాట అదుర్స్
రీసెంట్ గా హైదరాబాద్ వచ్చిన బాబా సెహగల్ కావో బిర్యానీ అంటూ పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మై హూ దివానా మైహూ దివానా బిర్యానీ కే దివానా.. కావో బిర్యానీ వెజ్ ఆర్ నాన్ వెజ్.. క్యాలరీకే బార్ మే సోచో మత్ అంటూ పాడిన పాట ఆకట్టుకుంటున్నది. బిర్యానీని ఆస్వాదించండి పల్లవి అందుకున్నారు. ఒక్కసారి రుచి చూస్తే ప్లేట్ బిర్యానీ తో ఆగలేరని, ఫుల్ బిర్యానీ మొత్తం తినేస్తారని పాట రూపంలో చెప్పారు. కాలరీలు, డైట్ అంటూ ఆలోచిస్తే మంచి భోజనాన్ని మిస్ అవుతారు అని పేర్కొన్నారు. కారం తగిలితే కాసిన్ని మంచినీళ్లు తాగి.. మళ్లీ తినండి బిర్యానీని ఆస్వాదించండి అంటూ పాడిన పాట ఇప్పుడు ట్రెండ్ అవుతున్నది. పాటకు తగ్గట్లుగా బీజీఎం కూడా పర్ఫెక్ట్ గా కుదిరింది. ఇంకేముంది పాట చూస్తున్న వాళ్లకు బిర్యానీ మీద మనసు మళ్లక తప్పదు.