Baba Jutananda Trolls : బాబా జూటానంద.. మోడీ హామీలపై ట్రోల్స్

Baba Jutananda Trolls Viral Poster in Social Media
Baba Jutananda Trolls on Modi Promises : బీజేపీ ఎన్నికల సందర్భంలో పలు హామీలిచ్చింది. వాటి అమలుకు చర్యలు తీసుకుంటామని వాగ్దానాలు చేసింది. దేశంలో నల్లధనం విదేశీ బ్యాంకుల్లో మూలుగుతోంది. దాన్ని వెనక్కి తీసుకొస్తామని చెప్పింది. దీంతో ప్రజలంతా బీజేపీని నమ్మారు. కానీ ఇప్పటికైతే రూపాయి నల్లధనాన్ని కూడా వెనక్కి తీసుకురాకపోవడంతో ప్రజలు పెదవి విరుస్తున్నారు.
ప్రజల ఖాతాల్లో రూ. 15 లక్షలు వేస్తామని పేర్కొన్నారు. అది కూడా కార్యరూపం దాల్చలేదు. ఇంతవరకు ప్రజల అకౌంట్లలో రూపాయి కూడా వేయలేదు. భేటీ బచావో కార్యక్రమం ద్వారా ఆడపిల్లలను చదివిస్తామని నమ్మించింది. ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రభుత్వంపై విశ్వాసంపోతోంది. ఇలా పలు వాగ్దానాలు చేసినా వాటి గురించి తరువాత మరిచిపోయారు.
దేశంలో వంద నగరాలను స్మార్ట్ సిటీలుగా మారుస్తామన్నారు. పెట్రోధరలు తగ్గిస్తాం రూ.35 లకే లీటర్ పెట్రోల్ ఇస్తామని చెప్పినా అది కూడా ఇంతవరకు తీర్చలేదు. దీంతో బీజేపీ మాటలు నీటి మూటలే అవుతున్నాయి. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పినా ఎక్కడ కూడా వారికి ఎలాంటి లాభం చేకూర్చలేదు. అవినీతిని అంతం చేస్తామన్నారు. కానీ ఇంకా అవినీతి పెరిగింది.
రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్నారు. పేదలకు పక్కా ఇళ్లు కట్టిస్తామన్నారు. ఇలా పలు వాగ్దానాలు చేసినా వాటిని తరువాత పట్టించుకోలేదు. దీంతో ప్రజల్లో విశ్వాసం పోతోంది. బీజేపీ ఇంకా పలు వాగ్దానాలు చేసి విస్మరిస్తోంది. దీంతో బీజేపీపై రోజురోజుకు విశ్వాసం పోతోందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బుల్లెట్ ట్రైన్స్ నడిపిస్తామని ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదు. ఇలా బీజేపీ హామీల మూటను విడిచిపెట్టడం పలు విమర్శలకు తావిస్తోంది.