JAISW News Telugu

Hanuman Records : 5 రోజుల్లో బాహుబలి అవుట్..’హనుమాన్’ ఖాతాలో మరో సెన్సేషనల్ రికార్డ్!

Hanuman sensational record

Hanuman sensational record

Hanuman Records : రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ వద్ద ఎవ్వరూ ఊహించని అద్భుతాలను సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతున్న చిత్రం ‘హనుమాన్’. ఒక చిన్న సినిమా పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఈ రేంజ్ లో కుదిపేస్తుందని మూవీ టీం తో పాటుగా ట్రేడ్ పండితులు కూడా ఊహించి ఉండరు. ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో థియేటర్స్ సరిపోకా, టిక్కెట్లు దొరకని వాళ్ళు పక్క థియేటర్స్ లో ఆడుతున్న ‘గుంటూరు కారం’ , ‘నా సామి రంగ’ చిత్రాలకు వెళ్తున్నారు.

ఏ సినిమాకి అయితే థియేటర్స్ రానివ్వకుండా తొక్కాలని చూసారో, ఇప్పుడు థియేటర్స్ లో ‘హనుమాన్’ చిత్రాన్ని ప్రదర్శించాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం తెలుగు వెర్షన్ వసూళ్లు మాత్రమే కాదు, హిందీ లో కూడా ఇదే రేంజ్ వసూళ్లతో సెన్సేషన్ ని సృష్టిస్తుంది ఈ చిత్రం.  5 వ రోజు బాలీవుడ్ లో ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు బాహుబలి పార్ట్ 1 కూడా రాలేదని అంటున్నారు అక్కడి ట్రేడ్ పండితులు.

బాహుబలి పార్ట్ 1 హిందీ లో 5 వ రోజు కేవలం రెండు కోట్ల 60 లక్షల రూపాయిల నెట్ వసూళ్లను మాత్రమే రాబట్టింది అట. కానీ ‘హనుమాన్’ చిత్రం ఏకంగా 3 కోట్ల 20 లక్షల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తుంది. సోమవారం, మంగళవారం వంటి రోజుల్లో ఈ సినిమాకి అక్కడ స్టడీ గా వసూళ్లు వస్తున్నాయంటే, కచ్చితంగా ఈ సినిమా పుష్ప రేంజ్ లో ఆడుతుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. పుష్ప సినిమా హిందీ లో 124 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది. అలాగే బాహుబలి పార్ట్ 1 సినిమాకి దాదాపుగా 147 కోట్ల రూపాయిల షేర్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకి ఉన్న ఊపు చూస్తూ ఉంటే బాహుబలి సినిమాని కొట్టేలాగానే అనిపిస్తుంది.

ఓవర్సీస్ లో కూడా అదే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం నార్త్ అమెరికా నుండే ఈ సినిమాకి మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నార్త్ అమెరికా లో హిందీ వెర్షన్ కి కూడా వసూళ్లు రావడం మొదలైంది. వాళ్ళు ఒక్కసారి అందుకున్నారంటే ఇక బాక్స్ ఆఫీస్ లెక్కలు ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు. అన్నీ కలిసి వస్తే ఈ చిత్రం నార్త్ అమెరికా లో బాహుబలి 1 కలెక్షన్స్ ని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Exit mobile version