నామినేటెడ్ పోస్టుల నియామకాలపై తీవ్ర ఊహాగానాల మధ్య, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ గా ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానెల్ టీవీ-5 ఛైర్మన్ బీఆర్ నాయుడిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్న నివేదికల ప్రకారం.. టీటీడీ చైర్మన్ పదవి కోసం విస్తృతంగా లాబీయింగ్ చేస్తున్న భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ కంటే చంద్రబాబు నాయుడు టీవీ5 చైర్మన్‌కే ప్రాధాన్యత ఇచ్చాడు. బీఆర్ నాయుడు ఎప్పటి నుంచో టీడీపీలో పనిచేస్తున్నారు. ఆయన 1987 ప్రాంతంలో డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారితో కనిపించిన ఫొటో వైరల్ అయ్యింది. ఆ ఫొటోలో దగ్గుబాటి ఎడమవైపున నాటి తెలుగు యువత నాయకుడు , ప్రస్తుత టిటిడి చైర్మన్ బి.ఆర్.నాయుడు, కుడివైపున నాటి రాజ్యసభ సభ్యులు రామచంద్రారెడ్డి, వెనుక వైపున నాటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కరణం రామచంద్రరావు గారు ఉన్నారు. ఆ అరుదైన ఫొటోను పైన చూడొచ్చు.