JAISW News Telugu

Ayodhya:రామ్ ల‌ల్లా గ‌ర్భాల‌యం ఫొటోలు షేర్ చేసిన ఆయోధ్య ట్ర‌స్ట్‌

Ayodhya:అయోధ్య‌లో శ్రీ‌రామ మందిరాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రామ్ ల‌ల్లా ఆల‌య నిర్మాణ ప‌నులు శ్రీ‌రామ్ జ‌న్మ‌భూమి తీర్ధ్ క్షేత్ర ట్ర‌స్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రుగుతున్నాయి. రామ్ ల‌ల్లా ఆల‌య ప్రాణప్ర‌తిష్ట కార్య‌క్ర‌మం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 22న జ‌రుగునుండ‌టంతో గ‌ర్భాల‌యం ఫొటోల‌ను టెంపుల్ ట్ర‌స్టు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చంప‌త్ రాయ్‌ శనివారం నాడు సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేశారు. రామ్ ల‌ల్లా గ‌ర్భాల‌యం ప‌నులు దాదాపు పూర్తి కావ‌చ్చాయ‌ని, లైటింగ్ ఏర్పాటు ప‌నులు ఇటీవ‌లే పూర్త‌య్యాయ‌ని, కొన్ని ఫొటోల‌ను షేర్ చేస్తున్నానని `ఎక్స్‌` వేదిక‌గా ఆయ‌న వెల్ల‌డించారు.

ఇదిలా ఉంటే రామ జ‌న్మ‌భూమిలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ఆల‌యం ఏ ద‌శ‌లో ఉందో తెలియ‌జేసే మ‌రిన్ని ఫొటోలను ఆల‌య ట్ర‌స్టు విడుద‌ల చేసింది. ట్ర‌స్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో నిల‌క‌డ‌గా ప‌నులు జ‌రుగుతున్నాయని తెలిపింది. బాల రాముడి విగ్ర‌హ నిర్మాణం మూడు లొకేష‌న్‌ల‌లో జ‌రుగుతోంద‌ని, దాదాపు 90 శాతం ప‌నులు పూర్త‌య్యాయ‌ని రాయ్ వివ‌రించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని గ‌ర్భ‌గృహంలో బాల‌రాముడిగా విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టిస్తామ‌ని, ఆల‌య గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం కూడా దాదాపు పూర్తి కావ‌చ్చింద‌ని తెలిపారు. ప్రాణప్ర‌తిష్ట కార్య‌క్ర‌మానికి ఎలాంటి స‌మ‌స్యా లేద‌ని స్ప‌ష్టం చేశారు.

ప్రాణ‌ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల‌ని 3 వేల మంది వీఐపీలు, పీఠాధిప‌తులు, డోన‌ర్లు, రాజ‌కీయ నాకుల‌తో స‌హా 7000 మందికి ట్ర‌స్టు ఆహ్వానాలు పంపింది. ఈ ఉత్స‌వానికి త‌ర‌లివ‌చ్చే వేలాది మంది భ‌క్తుల కోసం టెంపుల్ టౌన్‌లో త‌గిన బ‌స‌, ఇత‌ర ఏర్పాట్లు చేస్తున్నారు. భ‌వ్య రామమందిరంలో జ‌న‌వ‌రి 22న రామ్ ల‌ల్లా విగ్ర‌హ ప్ర‌తిష్టాప‌న కార్య‌క్ర‌మం అనంత‌రం భ‌క్తుల సంద‌ర్శ‌నానికి అనుమతిస్తారు.

Exit mobile version