BB7 Sivaji : బిగ్ బాస్ సీజన్ 7 ద్వారా ప్రముఖ సినీ నటుడు శివాజీ సంపాదించిన క్రేజ్, ఫాలోయింగ్ మామూలుది కాదు. 96 సినిమాల్లో ఆయన హీరో గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా చేసాడు కానీ, ఆయన్ని జనాలకు బాగా దగ్గర చేసింది మాత్రం ఈ బిగ్ బాస్ రియాలిటీ షోనే. ఈ షో తర్వాత అందరూ ఆయన్ని శివన్న అని పిలవడం మొదలు పెట్టారు. ఇలాంటి ఫేమ్ వస్తుందని ఆయన కలలో కూడా ఊహించి ఉండదు.
మనసులో ఏది ఉంటే మాట్లాడడం, కుండబద్దలు కొట్టినట్టు ముఖం మీదనే చెప్పేయడం శివాజీ స్టైల్. ఏదైనా నీతిగా, నిజాయితీగా చెయ్యాలి , నిజాయితీగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు. ఈ మంచి మనస్తత్వమే ఆయన్ని జనాలకు దగ్గర చేసింది. బిగ్ బాస్ టైటిల్ కూడా గెలుచుకునేవాడే కానీ, తన కంటే ఎక్కువగా ఆయన పల్లవి ప్రశాంత్ ని గెలిపించాలని అనుకోవడం తో టైటిల్ మిస్ అయ్యింది.
ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత ఆయన బోలెడన్ని ఇంటర్వూస్ ఇచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన అయోధ్య రామ మందిరం గురించి చేసిన కొన్ని కీలక కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. కొంతమంది శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలను తప్పుపడుతూ తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే ‘రాముడు అయోధ్య లో మాత్రమే ఉన్నాడా?, మా గ్రామం లో కూడా రామాలయం ఉంది. ఆయనకీ ఉత్సవాలు అక్కడ కూడా బాగా జరుపుతారు. మన దేశం లో ఉన్న మానవ జీవన విధానమే రామతత్వం. ఇది అర్థం చేసుకోకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే నేడు అయోధ్య లో రామ మందిరం నిర్మించారు, దీనిని రాజకీయాల కోసం వాడుకుంటున్నారు’ అంటూ శివాజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దేశం మొత్తం ఎంతో గర్వంగా భావిస్తున్న రామ మందిరం పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తావా, నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తావా అంటూ శివాజీ పై నెటిజెన్స్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇకపోతే జనవరి 22 వ తారీఖున జరగబొయ్యే రామ మందిరం ప్రారంభోత్సవ వేడుక కోసం దేశం నలుమూలల ఉన్న రామ భక్తులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో మన అందరికీ తెలిసిందే. ఆరోజున ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలకు సెలవులు ప్రకటించింది భారత ప్రభుత్వం.