Ayodhya Ram Lalla : అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ ఎక్కడ.. ఏ టైముకు.. చూడచ్చు?
Ayodhya Ram Lalla : భారతదేశమే కాదు నేడు ప్రపంచం చూపు భారత్ వైపునకే సారిస్తాయి. జగదబి రాముడి ప్రాణ ప్రతిష్ఠ నేడు (జనవరి 22) అంగరంగ వైభవంగా జరగనుంది. అందుకు శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేసింది. దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఈ మహిమాన్విత ఘట్టాన్ని వీక్షించి తరించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్ లల్లాను ఆలయం కింది భాగంలో ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా సాగుతుంది.
రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కోసం ప్రధాని మోడీ 11 రోజుల కఠిన దీక్షను స్వీకరించారు. 500 ఏళ్లుగా రాముల వారు గుడి లేకుండా ఉండిపోయారు. ఆయన గుడిని ఆయన ప్రియ భక్తుడు ప్రధాని నరేంద్ర మోడీతో నిర్మించింపజేసుకొని అందులో కొలువు దీరేందుకు వస్తున్నాడు. దేశంలో లోని ప్రముఖులు అయోధ్యకు చేరుకున్నారు. వారికి కావలసిన ఏర్పాట్లను అక్కడి ప్రభుత్వం ఇది వరకే చేసింది. భారీ భద్రత మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పహారా కాస్తున్నారు.
ప్రధాని మోడీ ఉదయం అయోధ్యకు చేరుకుంటారు. మధ్యాహ్నం వరకు ఆలయానికి చేరుకొని వేద మంత్రాల మధ్య రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠలో పాల్గొంటారు. ఈ మహోన్నత ఘట్టాన్ని టెలీకాస్ట్ చేసేందుకు అన్ని ఛానళ్లు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ సమాచార శాఖలోని దూరదర్శన్ లో ఉదయం 11 గంటల నుంచి 4Kలో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. దీని కోసం అయోధ్యలో 40 అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేశారు.