Ayodhya Ram : కలియుగంలో ఓ శబరి ఉంది తెలుసా?

Ayodhya Ram

Ayodhya Ram

Ayodhya Ram : రామాయణంలో రాముని భక్తురాలు శబరి పాత్ర గురించి మనకు తెలిసిందే. అది త్రేతాయుగం కాలం నాటి సంగతి. ప్రస్తుతం కలికాలంలో కూడా రాముడి భక్తిని ప్రతిబింబించే శబరి ఉండటం గమనార్హం. రాముడంటే శబరికి ఎంత భక్తి ఉంటుందో తెలుసు. అలాంటి శబరి ఇప్పుడు కూడా ఉందంటే అతిశయోక్తి కాదు. రాముడి నామస్మరణమే ఆమెకు మనోవాంఛ. రాముడి పేరు తలుచుకోవడమే ఆమె కర్తవ్యం. ఆయన సేవలోనే తన జన్మ తరించిందని నమ్ముతుంది.

జార్ఖండ్ లోని ధన్ బాద్ కు చెందిన సరస్వతి దేవికి 85 ఏళ్లు. నిరంతరం రాముడి ధ్యానంలోనే గడుపుతుంది. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ప్రతిజ్ణ చేసింది. రోజుకు 23 గంటలు మౌనవ్రతం చేయాలని భావించింది. అప్పటి నుంచి అదే దారిలో నడిచింది. ఒక గంట పాటు మాత్రమే కుటుంబ సభ్యులతో మాట్లాడేది.

2020లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటి నుంచి 24 గంటలు మౌనవ్రతంలోనే కొనసాగుతోంది. ఈనెల 22 వరకు ఆమె మౌనవ్రతం పాటిస్తోంది. అయోధ్యలో రామమందిరంలో రాముడి విగ్రహ ఏర్పాటుతో ఆమె మౌన దీక్ష పూర్తి కానుంది. రాముడిపై ఉన్న భక్తితో ఆమె చేసిన మౌనవ్రతంతో ఆమె శబరి కంటే ఎక్కువ భక్తురాలుగా ఖ్యాతి పొందుతోంది.

ప్రస్తుతం ఈ అభినవ శబరి గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రామాయణంలో శబరి పాత్రను గుర్తు చేస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కనీవిని ఎరగని రీతిల ఆమెకు భద్రత కల్పిస్తున్నారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన తరువాత తన మౌనవ్రతం వీడనుంది. దీంతో శబరి లాంటి భక్తురాలు గురించి అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

TAGS