Allu Arjun : జైలు నుంచి విడుదలయ్యాక అల్లు అర్జున్ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చిన ఆయాన్, స్నేహ.. ఎమోషనల్ వీడియో

Allu Arjun and Sneha
Allu Arjun Emotional Video : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఒకవైపు పుష్ప 2 థియేటర్స్ లో ఉండగానే ఈ పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. ఈ కేసులో ఏ 11గా అల్లు అర్జున్ పేరు పొందుపరిచారు. డిసెంబర్ 12న అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ని ప్రవేశ పెట్టారు.
జడ్జి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అరెస్ట్ తర్వాత మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ ను చూసిన పిల్లలు అయాన్, అర్హ పరుగున వచ్చారు. తండ్రిని హగ్ చేసుకునే ప్రయత్నం చేశారు. భార్య స్నేహ సైతం ఆతృతగా ఎదురు చూశారు. ఈ ఎమోషనల్ వీడియో వైరల్ అవుతుంది.
జైలు నుండి విడుదలైన అనంతరం ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో అల్లు అర్జున్ pic.twitter.com/L3Q3bMhjdt
— Telugu Scribe (@TeluguScribe) December 14, 2024