BJP : యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ లీక్: బీజేపీ సేఫ్నా?

BJP

BJP

BJP : జూన్ 1న చివరి దశ పోలింగ్ ముగుస్తుంది. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే రోజు సాయంత్రం వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు ప్రముఖులు వారికి అందిన వివరాల ప్రకారం అంచనాలు వేస్తున్నారు. ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియాకు చెందిన రాజ్‌దీప్ సర్దేశాయ్ బీజేపీకి తీపికబురే వినిపించారని చెప్పవచ్చు. ఈ సారి కూడా స్థిరమైన ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అయితే మోడీ చెప్పనన్ని సీట్లు రాకపోవచ్చని మాత్రం చెప్పారు.

లోక్ సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. దీనికి ముందు రాజకీయ విశ్లేషకులు, వ్యూహకర్తలు దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్, యావత్ దేశంపై తమ అంచనాలను పంచుకుంటున్నారు. వారిలో ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియాకు చెందిన రాజ్‌దీప్ సర్దేశాయ్ ఒకరు. ఉత్తర్‌ప్రదేశ్. ఒక టీవీ ఛానల్ దేశ వ్యాప్త రాజకీయ పరిస్థితుల గురించి ఆయనను ప్రశ్నించినప్పుడు ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో  సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ప్రజల నుంచి గణనీయమైన మద్దతు ఉందని పేర్కొన్నారు. అఖిలేష్ ఈ సారి వ్యూహాత్మకంగా టికెట్ల పంపిణీ చేసినప్పటికీ సమాజ్ వాదీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు బలంగానే ఉన్నాయని ఆయన చెప్తున్నారు.

భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి సొంతంగా 280 సీట్లు వస్తాయని సర్దేశాయ్ జోస్యం చెప్పారు. అయితే మిత్ర పక్షాలతో కలుపుకుంటే గతం కంటే కొంత మేర తగ్గవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చిందని, స్థిరమైన ప్రభుత్వాలు ఉంటే పాలన బాగుంటుందని బలంగా కోరుకుంటున్నారని. ఇందులో భాగంగా వారు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వమే మరోసారి రావాలని ఆకాంక్షిస్తున్నారని సర్దేశాయ్ చెప్పారు. స్థానికంగా బీజేపీ నాయకులపై కొంత అసంతృప్తులు ఉన్నా.. సాధారణ సెంటిమెంట్ మాత్రం మోదీ వైపే ఉందని అందువల్ల ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రతిపక్షాలను అధిగమించే అవకాశం ఉందన్నారు.

సర్దేశాయ్ అంచనా ప్రకారం బీజేపీకి 280 నుంచి 320 సీట్లు వస్తాయని తేలింది. ఒకవేళ బీజేపీ ఈ పరిధిని దాటితే, లోక్ సభలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంది.

TAGS