Auto Driver : ఆటో డ్రైవర్ ఆఫీస్ ఛైర్.. ఐడియా అదుర్స్

Auto Driver Idea
Auto Driver Idea : ఓ ఆటో డ్రైవర్ తన సౌకర్యం కోసం ఆఫీస్ ఛైర్ ను ఏర్పాటు చేసుకున్నాడు. దీంతో అతడి ఆలోచనకు నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్య గురించి చెప్పనక్కరలేదు. రద్దీ కారణంగా అక్కడి ప్రజలు నిత్యం సమస్యలు ఎదుర్కుంటూనే ఉంటారు. ఇక ఆటో డ్రైవర్ల పరిస్థితి అయితే వర్ణనాతీతం. ఈ క్రమంలో ఓ ఆటో డ్రైవర్ వినూత్నంగా తాను కూర్చునేందుకు వీలుగా ఖరీదైన ఆఫీస్ ఛైర్ ను ఏర్పాటు చేసుకున్నాడు.
దీనికి సంబంధించిన ఫొటోను క్రెడ్ ఉద్యోగి ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆటో డ్రైవర్ ఆలోచన సూపర్ అంటూ పోస్టు పెట్టారు ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారడంతో ఆటో డ్రైవర్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.