Australia Record : పవర్ ప్లేలో ఆస్ట్రేలియా రికార్డు.. ట్రావిస్ హెడ్, మార్ష్ విధ్వంసం
Australia Record : ఆస్ట్రేలియా, స్కాట్లాండ్ మధ్య జరుగుతున్నటీ 20 సిరీస్ లో ఆసీస్ బ్యాట్స్ మెన్ పవర్ ప్లే లో 113 పరుగులు చేసి రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ మ్యాచుల్లో ఈ స్కోరే పవర్ ప్లేలో అత్యధికం కావడం గమనార్హం. మొదటి మూడు బంతులకు డెబ్యూ ఓపెనర్ జేమ్స్ ఫ్రెజర్ మెక్ గుర్క్ డకౌట్ కాగా.. ఆ తర్వాత వచ్చిన మార్ష్ కు తోడు ట్రావిస్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
వీరి ధాటికి కేవలం 6 ఓవర్లలోనే స్కోరు ఏకంగా 113 పరుగులు దాటింది. పవర్ ప్లేలో ఆసీస్ 113/1 స్కోరు చేసి కొత్త రికార్డును క్రియేట్ చేశారు. ట్రావిస్ హెడ్ 25 బంతుల్లోనే 12 ఫోర్లు, 3 సిక్సులతో 80 పరుగులు చేసి స్కాట్లాండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. హెడ్ కు తోడు మిచెల్ మార్ష్ సైతం 12 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సులతో 39 పరుగులు చేయగా.. స్కాట్లాండ్ విధించిన 155 పరుగుల స్కోరు లక్ష్యాన్ని కేవలం 9.3 ఓవర్లలోనే ఛేదించింది.
ఛేజింగ్ లో కూడా 155 పరుగుల లక్ష్యాన్ని ఇంత తొందరగా చేజ్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. యూకే లో జరుగుతున్న మ్యాచ్ లో ఆసీస్ సరికొత్త రికార్డులు సృష్టించింది. ఆసీస్ మ్యాచ్ లో స్కాట్లాండ్ బ్యాటర్ మున్సీ ఒక్కడే 28 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. కాగా ఆసీస్ బౌలర్లలో అడమ్ జంపా 2 వికెట్లు, బారిటర్ 2 వికెట్లు తీయగా.. సీమ్ అబాట్ మూడు వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్ మ్యాచ్ లో ఇలాంటి రికార్డు సన్ రైజర్స్ హైదరాబాద్ పేరిట ఉంది. ఢిల్లీ డేర్ డెవిల్స్ పై సన్ రైజర్స్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇద్దరు కేవలం 6 ఓవర్లలోనే 125 పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేశారు. కాగా ఇంటర్నేషనల్ టీ 20 ల్లో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.