JAISW News Telugu

New Movies : పంద్రాగస్టున మూవీస్ రిలీజ్..  ఏది బెస్ట్ అంటే..

New Movies

New Movies

New Movies : పాన్ ఇండియా లెవల్ లో పంద్రాగస్టుకు ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు సినిమాలు రిలీజ్ అయ్యి తెగ సందడి చేస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా నాలుగు సినిమాలు చెప్పుకోవచ్చు. మరి  ఈ నాలుగు సినిమాల్లో ఏ పిక్చర్ బాగుంది, ఏ సినిమా చూడాలి అనే కన్ఫ్యూజన్ ఉండడం సాధారణం. అలా లేకుండా ఉండేందుకు ఏ సినిమా బాగుందో తెలుసుకుందాం.. ప్రధానంగా కోలీవుడ్ హీరో విక్రమ్ నటించిన తంగలాన్.. రవితేజ, హరిశ్ శంకర్ కాంబినేషన్లో మిస్టర్ బచ్చన్, రామ్, పూరీ జగన్నాథ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ , ఇక జూనియర్ ఎన్ టీ ఆర్ బావమరిది నార్నే నితన్ ఆయ్ సినిమాతో సందడి చేస్తున్నారు.

తంగలాన్…

విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన తంగలాన్ మూవీ ఓ కొత్త ప్రయోగంగా చెప్పుకోవచ్చు. టెక్నికల్ గా ఇది ఒక బ్రిలియంట్ పిక్చర్ గా చెప్పుకోవచ్చు. కానీ, కథ, కథనంలో ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విషయాలు తక్కువగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో బ్రిటీష్ వాళ్లు బంగారం నిధి కావాలని కోరుకుంటారు. ఈ నిధి కోసం విక్రమ్(తంగలాన్) సాయం కో రుతారు. బంగారం నిధి కో సం జరిగే తవ్వకాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ కథనం వినడానికి బాగానే ఉన్నా చూసేందుకు కాస్త ఓపిక  ఉండాలి. ఎందుకంటే కొంత సాగదీసినట్టు  కనిపిస్తుంది. కొత్త ప్రయోగం బాగానే ఉన్నా ఫలితం మాత్రం కాస్త డిఫరెంట్ గానే వచ్చింది. కానీ విక్రమ్ ఎఫెక్ట్స్, యాక్షన్ మెచ్చుకోవాల్సిందే.

మిస్టర్ బచ్చన్..

రవితేజ, హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన ఈ సినిమా కథ అందరికీ తెలిసిందే. అజయ్ దేవగన్ రైడ్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తీశారు. అయితే కథలో మాత్రం చాలా మార్చారు. ఆ సినిమాలో లేని లవ్ సీన్స్ ను ఈ పిక్చర్లో పెట్టారు. దర్శకుడు హరీశ్ శంకర్ మాస్ డైలాగ్స్ సినిమాకే హైలెట్ గా నిలిచాయి. మొదటి భాగం సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. ఎడిటింగ్, డైలాగ్స్ డీసెంట్ గా నిలిచాయని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ మాత్రం దానికి భిన్నంగా కొనసాగింది.  హీరో, విలన్ మధ్య సంఘర్షణ మెరుగ్గా లేదు. ఈ సినిమాతో ర వితేజ గ్రాఫ్ కొంత పడిపోయి ఉండొచ్చు.

డబుల్ ఇస్మార్ట్..

ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి టాక్ సంపాదించుకోగా, ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. పూరి జగన్నాథ్ ఏదో మాజిక్ చేస్తాడని భావించారు. కానీ, ఎక్కడో అది మిస్ అయ్యింది. ఫస్టాఫ్ సినిమాన్ హైప్ చేస్తే సెకండాఫ్ దానిని అడ్డుకుంది. రామ్ పోతినేని, ఎనర్జీ, కావ్య థాఫర్ గ్రామర్ మాత్రం మెప్పించాయని చెప్పవచ్చు. మొత్తంగా  ఈ సినిమా తన ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేసిందని చెప్పుకోవాలి.

ఆయ్…

ఇక జూనియర్ ఎన్ టీ ఆర్ బావమరిది నార్నే నితిన్  నటించిన సినిమా ఆయ్. ఇది అతనికి రెండో సినిమా. ముగ్గురు అగ్రహీరోల నడుమ ఈ సినిమాను రిలీజ్ చేశారంటే కంటెంట్ పై వారికి ఉన్న నమ్మకమే అని చెప్పుకోవాలి. అయితే కాస్ట్, యాక్షన్, ఎలిమెంట్స్ అనేవి కాకుండా ఒక డీసెంట్ సినిమా చూడాలనుకుంటే ఈ సినిమాకు వెళ్లవచ్చు. ఇక ఈ నాలుగు సినిమాల్లో ఒకటి చూడాలనుకుంటే మిస్టర్ బచ్చన్ పేరు చెప్పవచ్చు. ఎందుకంటే మిగతా మూడు సినిమాలు ఫస్ట్ ఆఫ్ బాగా అనిపించినా సెకండాఫ్ సాగదీసినట్టు అనిపిస్తుంది.

Exit mobile version