belt shop : మద్యం బెల్టుషాపు నిర్వహణకు దేవుడి పేరిట నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయి ధర పలికింది. ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం మాగుటూరులో బెల్టుషాపు ఏర్పాటుకు బహిరంగ వేలం నిర్వహించారు. ఓ ఆలయంలో గ్రాబస్థులు వేలంపాట నిర్వహించగా రూ.7.10 లక్షలకు ఓ వ్యక్తి బెల్టుషాపును దక్కించుకున్నారు. రెండేళ్లపాటు మద్యం బాటిల్ పై ఎంఆర్పీ కన్నా రూ.30 నుంచి రూ.50 వరకు అమ్ముకోవచ్చని తీర్మానం చేశారు. వేలంలో షాపు దక్కించుకున్నవారు తప్ప గ్రామంలో మరెవరూ మద్యం అమ్మరాదని తీర్మానించారు. వేలంపాటలో పాడిన నగదును వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఇచ్చేలా నిర్ణయించారు. ఆలయ ఆవరణలో బెల్టు షాపునకు సంబంధించి వేలంపాట నిర్వహిస్తున్న వీడియో సోషలు మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.