JAISW News Telugu

IPS Officers : చంద్రబాబును కలిసేందుకు ఐపీఎస్ అధికారుల యత్నం.. అనుమతి నిరాకరణ

IPS Officers

IPS Officers

IPS Officers : టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు వచ్చిన కొందరు అధికారులకు నిరాశే మిగిలింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్దకు వచ్చిన ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును పోలీసులు అడ్డుకున్నారు. అదే విధంగా మరో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కొల్లి రఘురామిరెడ్డికి సైతం అనుమతి నిరాకరించారు.

ఎన్నికల విధుల్లో అవకతవకలకు పాల్పడ్డారని పీఎస్సార్ ఆంజనేయులుని ఈసీ తప్పించింది. ఈసీ ఎన్నికల విధులు నుంచి తప్పించాక కూడా అనధికారికంగా కూడా వైఎస్సార్సీపీ కోసం ఆంజనేయులు పనిచేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రధాన గేటు వద్దే కానిస్టేబుళ్లు పీఎస్సార్ ఆంజనేయులు కారు ఆపి లోనికి అనుమతి లేదని చెప్పారు. దీంతో ఆంజనేయులు చంద్రబాబు నివాసం దగ్గర నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.

అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు ఐపీఎస్ అధికారి రఘురామిరెడ్డి యత్నించారు. మర్యాద పూర్వక భేటీ పేరుతో చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లిలోని నివాసం వద్ద యత్నించగా సెక్యూరిటీ నిరాకరించింది. ఈ సందర్భంగా అనుమతి కోసం ఫోన్ లో సంప్రదించినా అనుమతి లభించలేదు.

నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ సమయంలో కొల్లి రఘురామిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. NSG నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు నిద్రిస్తున్న బస్సు తలుపు డోర్ కొట్టారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో వైసీపీకి విధేయుడుగా ఉన్నాడని రఘురామిరెడ్డిపై ఈసీ కొరడా ఝుళిపించింది. అన్ని శాఖల నుంచి తప్పిస్తూ డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

Exit mobile version