Viral Video : ప్రజాస్వామికవాదులపై దాడి చేస్తే ప్రజలు తిరగబడుతారు!
Viral Video : ప్రపంచ వ్యాప్తంగా పాలస్తీనియన్లకు ప్రజాస్వామికవాదుల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమన్ సామ్రాజ్యం ఓడిపోయిన తర్వాత పాలస్తీనా అని పిలువబడే భూభాగాన్ని బ్రిటన్ స్వాధీనం చేసుకుంది. అప్పట్లో ఇజ్రాయెల్ అనే దేశమే లేదు. ఇజ్రాయెల్ నుంచి వెస్ట్ బ్యాంక్ వరకు ఉన్న ప్రాంతాన్ని పాలస్తీనా భూభాగం అని పిలిచేవారు. ఆ ప్రాంతంలో అరబ్బులు అధిక శాతంలోనూ, యూదులు కొద్దిమంది మాత్రమే ఉండేవారు. అయితే.. పాలస్తీనా స్థానిక ప్రజలు మాత్రం తమ భూభాగంలో నివసిస్తున్న అరబ్బులు, యూదులు బయటి నుంచి వచ్చిన వ్యక్తులని చెప్తారు. బయటి వాళ్లు తమ భూభాగానికి వచ్చారన్న అసంతృప్తి అప్పట్లో స్థానిక ప్రజల్లో ఉండేదని సమాచారం.
చాలామంది పాలస్తీనియన్లు ఇప్పటికీ తూర్పు జెరూసెలం, గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరికి ఇజ్రాయెల్‌కు మధ్య కొన్ని విషయాల్లో తరచూ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. గతేడాది ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేయడం.. దానికి ప్రతిచర్యగా ఇజ్రాయెల్..పాలస్తీనాపై దాడులు ఇప్పటికీ కొనసాగుతూ వేలాది మంది అమాయకులు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. పాలస్తీనాపై దాడులు ఆపాలంటూ, పాలస్తీనాను ప్రత్యేక దేశంగా ఇజ్రాయెల్ గుర్తించాలని ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక వాదులు డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా స్పెయిన్ లోని ఒక స్టేడియంలో ఓ పాలస్తీనా మద్దతుదారుడు బ్యానర్ తో పాలస్తీనాకు మద్దతుగా నినాదాలు చేసుకుంటూ పరుగెత్తాడు. దీంతో పోలీసులు పట్టుకుని విపరీతంగా కొట్టారు. దీంతో అక్కడున్న ప్రేక్షకులు ఆగ్రహం పట్టలేక ఒక్కొక్కరుగా వచ్చి సదరు పోలీసులపై దాడి చేశారు. దీంతో ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ప్రజాస్వామిక వాదులపై పోలీసుల పెత్తనం, జాత్యాంహకర పోకడలకు స్థానం లేదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. పోలీసుల పెత్తనం చెలాయిస్తే ప్రజలు ఊరుకోరని, దానికి స్పెయిన్ ఘటనే నిదర్శనమని హెచ్చరిస్తున్నారు. ప్రజాస్వామిక వాదులపై దాడి చేస్తే ప్రజలు ఊరుకోరని తిరగబడుతారని అంటున్నారు.