Sharmila : జగన్ ను బెదరగొడుతున్న షర్మిల అటాకింగ్
Sharmila : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఓటమి భయం పట్టుకుంది. ఒక వైపు టీడీపీ కూటమి, మరోవైపు కాంగ్రెస్ కూటమి రెండు వైపుల పదునైన కత్తుల్లా మారాయి. దీంతో తనకు ఓటమి తప్పదనే భయం వెంటాడుతోంది. దీంతో ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. తాజాగా దెందులూరులో జరిగిన కాంగ్రెస్ సభలో షర్మిల వైఎస్ వారసుడు జగన్ కాదని చెప్పడంతో కంగారు పడుతున్నారు.
సభ ముగిసిన వెంటనే పోలీసులు అక్కడి నుంచి జారుకున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి సైతం ఎవరు లేరు. దీంతో షర్మిల ట్రాఫిక్ లోనే గంటపాటు ఇరుక్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. షర్మిల కాన్వాయ్ గంట పాటు ట్రాఫిక్ లోనే ఉండాల్సి వచ్చింది. ఎస్పీకి ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు. చివరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులే ట్రాఫిక్ క్లియర్ చేసే బాధ్యత తీసుకోవడం గమనార్హం.
సొంత చెల్లెలు పైనే కక్షసాధింపు చర్యలకు దిగిన జగన్ పై విమర్శలు వస్తున్నాయి. రాజకీయాల్లో రాణించే హక్కు అందరికి ఉంటుంది. అది చెల్లెయినా తల్లయినా భరించాల్సిందే. కానీ షర్మిల తనపై చేస్తున్న విమర్శలకు జంకుతున్నట్లు తెలుస్తోంది. జగన్ పై షర్మిల విమర్శల జోరు పెంచుతోంది. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.
జగన్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరించడంతో వైసీపీకే నష్టం వచ్చే అవకాశాలున్నాయి. చిల్లర రాజకీయాలు చేస్తే ఫలితాలు దారుణంగా ఉంటాయి. ప్రజలు రిసీవ్ చేసుకోరు. దీంతో ఓటమి భయం వెంటాడుతోంది. వచ్చే ఎన్నికల్లో బయట పడతామనే భావన వారిలో కనిపించడం లేదు. అందుకే ఇలాంటి పాలిట్రిక్స్ కు తెర తీస్తున్నారు. కానీ వారే బాధ్యులవుతారనే విషయం అర్థం కావడం లేదు.
రాజకీయాల్లో హుందాగా ఉండాలి కానీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే దాని ప్రభావం కచ్చితంగా ఉంటుంది. మాదే విజయం అని జగన్ బీరాలు పలుకుతున్నా లోపల భయం మాత్రం ఉంది. దీంతో ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే దానిపైనే తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఓటమి మాత్రం ఖాయమనే సర్వేలు సూచిస్తున్నాయి.