Love Reddy : కొన్ని సినిమాల్లోని క్యారెక్టర్లు ప్రేక్షకులపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. అయితే తరహా ప్రభావం 2000 సంవత్సరం వరకు ఉండేది. పెరిగిన సాంకేతికత, మేకింగ్ వీడియోలు రిలీజ్ చేస్తుండడంతో ప్రేక్షకులు కూడా వాటిని మామూలుగానే తీసుకుంటున్నారు. అయితే తాజాగా లవ్ రెడ్డిలో నటించిన ఓ యాక్టర్ ఓ మహిళ దాడి చేయబోయింది. అయితే ఆమెకు ఆ నటుడితో వ్యక్తిగత వివాదాలు ఏమిలేవు. కానీ సదరు నటుడు ఆ పాత్రలో అంతలా జీవించిపోయాడు. నిజంగానే అలా చేశాడేమోనని థియేటర్ లో సదరు నటుడి గల్లా పట్టి కొట్టబోయినంత పని చేసేందుకు. ఈ క్రమంలో ఆమె నోటికి కూడా హద్దు లేకుండా పోయింది. తీవ్ర పదజాలంతో దూషించింది.
ఒకప్పటి తరం నటులు ఎస్వీ రంగారావు, రాజనాల, కైకాల సత్యనారాయణ, రావుగోపాలరావు, చలపతిరావు లాంటి నటులు ఎక్కువగా విలనీ పాత్రలు చేసేవాళ్లు. ఆ పాత్రలు వారికి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అదే సమయంలో ఆ పాత్రలు చేసినందుకు తీవ్రంగా వ్యతిరేకత కూడా ఎదుర్కొన్నారు. వాళ్లను నేరుగా ఎదురైన సందర్భాల్లో చీదరించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. విలన్ క్యారెక్టర్లు చేసిన వారికి తమ పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి కూడా వెనుకాడిన సందర్భాలు ఉన్నాయి. అంటే అప్పటి నటులు ఎంతగా ఆయా పాత్రలను ప్రేమించి ప్రాణం పోశారో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఎదురైంది. చూసేది సినిమా అని తెలిసినా సదరు క్యారెక్టర్ బిహేవియర్ తట్టుకోలేక ఓ మహిళ సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఇటీవల విడుదలైన లవ్ రెడ్డి చిత్రం బృంతం అక్టోబర్ 24న హైదరాబాద్ లోని ఓ థియేటర్ కు వెళ్లింది. ఇందులో తండ్రి పాత్రపోషించిన ఎన్టీ రామస్వామి ఉన్నారు. అక్కడ ఉన్న మహిళ బండ బూతులు తిట్టుకుంటూ ఎన్టీ రామస్వామి దగ్గరికి వెళ్లి కొట్టబోయింది. ఆమె రామస్వామి గల్లా పట్టుకోబోతుంటే టీమ్ సభ్యులు ఆమెను నిలువరించారు. ఆమెకు ఎంత సర్ది చెప్పినా కొంత సేపటి వరకు ఆమె కన్విన్స్ కాలేదు. కానీ అప్పటికే అక్కడ ఉన్న ప్రేక్షకులంతా ఏం జరుగుతుందో తెలియక షాకయ్యారు. కానీ కాసేపటికి విషయం తెలిశాక అంతా నవ్వుకున్నారు.