Trump condemned : బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి.. ఖండించిన ట్రంప్
Trump condemned : షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన ఆకృత్యాలను డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. మత అజెండాల నుంచి హిందూ అమెరికన్లను కాపాడతానని, వారి స్వేచ్ఛ కోసం పోరాడుతానని ట్రంప్ హామీ ఇచ్చారు. దీపావళి సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన ఆకృత్యాలను ఖండిస్తున్నానని అన్నారు. మత అజెండాల నుంచి హిందూ అమెరికన్లను కాపాడతానని, వారి స్వేచ్ఛ కోసం పోరాడుతానని ట్రంప్ హామీ ఇచ్చారు.
‘‘బంగ్లాదేశ్ లో హిందువులు, క్రైస్తవులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న అనాగరిక హింసను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అక్కడి మైనారిటీలపై సామూహిక దాడులు, దోపిడీలు జరుగుతున్నాయి. పరిస్థితి మొత్తం గందరగోళంగా ఉంది. నా దృష్టిలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ జరగలేదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.