Kodali Nani PA : వైసీపీ నేత కొడాలి నాని మాజీ పీఏపై దాడి

Kodali Nani PA
Kodali Nani PA : వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని మాజీ పీఏ ఆచంట లక్ష్మోజీపై సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ప్రస్తుతం ఆయన మచిలీపట్నం కలెక్టరేట్ లో పౌరసరఫరాల విభాగంలో పని చేస్తున్నాడు. నిన్న విధులు ముగించుకొని రైలులో గుడివాడకు వచ్చాడు. స్టేషన్ పక్కనే ఉన్న తన బైక్ ను తీస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడిచేశారు.
తనపై దాడి చేసింది ఎవరో తనకు తెలియదని చెప్తున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో చేరకుండా ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. అతనిపై దాడికి వ్యక్తిగత కారణాలా? లేక రాజకీయ కక్షలు ఉన్నాయా? అన్నది తెలియాల్సి ఉంది. దాడి విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ వెంటనే గుడివాడ చేరుకుని సంఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.