conductor : ఆధార్ విషయమై కండక్టర్ పై దాడి.. కేసు నమోదు
conductor : ఆధార్ విషయంలో ఓ ప్రయాణికురాలు, కండక్టర్ ఘర్షణ పడ్డారు. ఏపీ ఆధార్ ను కండక్టర్ నిరాకరించడంతో ఆగ్రహించిన ప్రయాణికురాలు కండక్టర్ పట్ల దురుసుగా వ్యవహరించి చేయి చేసుకుంది. దీంతో కండక్టర్ పోలీసులను ఆశ్రయించడంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. పైగా పోలీస్ స్టేషన గేటు వద్ద బైఠాయించి ధర్నాకు దిగింది. ఈ క్రమంలో పోలీసులు తప్పని పరిస్థితుల్లో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామన్నారు.
ఈనెల 4న చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలను పోలీసులు వెల్లడించారు. 4న ఈసీఐఎల్ నుంచి ఉప్పల్ వెళ్తున్న (ఏపీ29 జెడ్ 3181) ఆర్టీసీ బస్సులో కొయ్యల సరిత అనే ప్రయాణికురాలు సరిత ఆంధ్రప్రదేశ్ అడ్రస్ తో ఉన్న ఆధార్ ను చూపింది. ప్రభుత్వ నిబంధనల మేరకు తెలంగాణ ఆధార్ మాత్రమే చెల్లుబాటవుతుందని, ఇది చెల్లదని, టికెట్ కొనుగోలు చేయాలని కండక్టర్ సూచించింది. దీంతో ఆగ్రహించిన ఆమె కండక్టర్ తో గొడవకు దిగి, కండక్టర్ పై చేయి చేసుకుంది. దీంతో కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.