Teacher bit : దారుణం.. బాలిక తొడ కొరికిన టీచర్

teacher bit
Teacher bit : ఏపీలో ఓ టీచర్ అసభ్యంగా ప్రవర్తించాడు. పిల్లలకు విద్యాబుద్దులు నెర్పాల్సిన టీచర్ వారితోనే అసభ్యకరంగా ప్రవర్తించాడు. 3వ, తరగతి చదువుతున్న ఓ బాలిక తొడపై కొరికి ఎవరికైనా చెపితే చంపేస్తానని బెదిరించాడు. ఈ దారుణ ఘటన కృష్ణా (డి) నరసింహపురంలో జరిగింది.
ఏడుస్తూ ఇంటికి వెళ్లిన చిన్నారి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోక పోవడంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు వేణుగోపాలరావును పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.