JAISW News Telugu

Atishi Marlena Singh : ఢిల్లీ సీఎంగా ఏపీలో స్కూల్ టీచర్.. అతిషి మర్లేనా సింగ్ గురించి తెలుసా?

Atishi Marlena Singh

Atishi Marlena Singh

Atishi Marlena Singh : ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయడంతో ‘అతిషి మర్లేనా సింగ్’ ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొంది ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఈ కేసులో తాను నిర్ధోషినని భావిస్తే ఢిల్లీ ప్రజలు తనను ఎన్నికల్లో తిరిగి ఎన్నుకుంటారని తన పదవికి రాజీనామా చేశారు. ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ గా ఉన్న అతిషిని ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు సంయుక్తంగా కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.

రాజకీయాల్లోకి రాకముందు అతిషి ఆంధ్రప్రదేశ్ (ఏపీ)లో టీచర్ గా పని చేశారు. మదనపల్లెలోని రిషి వ్యాలీ స్కూల్ లో ఇంగ్లిష్, హిస్టరీ టీచర్ గా ఆమె పనిచేస్తున్నారు. ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి రిషి వ్యాలీ స్కూల్ ను కూడా ఆమె స్థాపించారు.

అతిషి ఢిల్లీలోని స్ప్రింగ్ డేల్స్ స్కూల్ లో పాఠశాల విద్యను అభ్యసించారు. 2001లో ఢిల్లీ యూనివర్సిటీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం యునైటెడ్ కంట్రీస్ (యూకే) లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్లింది. ఆమె రోడ్స్ స్కాలర్ కూడా.

అతిషి మర్లేనా సింగ్ రాజకీయాల్లోకి రాకముందు రిషి వ్యాలీ స్కూల్లో టీచర్ గా పని చేశారు. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఆమె ఒకరు. ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టిన సమయంలో కెజ్రీవాల్ ఆశయాలు నచ్చి ఆమె ఆ పార్టీలో చేరారు. ఆ పార్టీలో ఇప్పటి వరకు కూడా కీ రోల్ పోషించారు. ఆమె ఏపీలో స్కూల్ టీచర్ గా పని చేయడంతో ఆమె స్టూడెంట్స్ గా ఉన్న కొందరు ఢిల్లీ సీఎం అవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version