Brahmotsavam : తిరుమలలో బ్రహ్మోత్సవాల వేళ.. అపశ్రుతి

Brahmotsavam

Brahmotsavam

Brahmotsavam : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కలియుగ వైకుంఠం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. వాహన సేవలకు విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.ఉత్సవాల్లో భాగంగా గురువారం అంకురార్పణ కార్యక్రమం జరిగింది. కాగా, శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. అయితే, ఈ కార్యక్రమానికి అర్చకులు, వేద పండితులు సమాయత్తం అవుతున్నారు. అక్కడ ధ్వజ స్తంభం వద్ద ఉండే ఓ కొక్కెం విరిగిపోయింది.

సాయంత్రం ధ్వజారోహణంలో ఈ ధ్వజ స్తంభంపైనే గరుడ పఠాన్ని అర్చకులు ఎగురవేసి, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించనున్నారు. ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్టు భావిస్తారు. సాయంత్రం జరిగే కార్యక్రమం కోసం ధ్వజ స్తంభం కొక్కెం పరిశీలిస్తుండగా అది విరిగిపోయినట్టు గుర్తించారు. అప్రమత్తమైన అర్చకులు వారు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆలయానికి చేరుకున్నారు. తక్షణమే అర్చకులు ధ్వజస్తంభం పైకి వెళ్లి మరమ్మతు పనులు ప్రారంభించారు. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొక్కెం అతికించే ప్రక్రియ చేపట్టామని టీటీడీ వర్గాలు తెలిపాయి.

TAGS