Vijay Devarakonda : కింది స్థాయి నుంచి ఎదిగిన నటుడిలో విజయ్ దేవరకొండ ఒకరు. షార్ట్ ఫిలింలు, చిన్న చిన్న సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అలా ఎదుగుతూ అర్జున్ రెడ్డితో బాక్సాఫీస్ స్టార్ గా మారిపోయాడు. తర్వాత గీత గోవిందంతో ‘ఫ్యామిలీ’ ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఆయన తీసిన సినిమా ఫ్యామిలీ స్టార్ ఈ నెల రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్ వర్క్ లో బీజీగా ఉంది.
విజయ్ దేవరకొండ – పరశురామ్ కాంబోలో తెరకెక్కిన మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ కాగా.. ‘శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్’ పతాకంపై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించారు. ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 01వ తేదీ హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో దిల్ రాజు, విజయ్, మృణాల్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించి సందడి చేశారు.
దిల్ రాజు మాట్లాడుతూ ‘బొమ్మరిల్లు’, ‘శతమానం భవతి’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కించిన తన బ్యానర్ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పై ‘ఫ్యామిలీ స్టార్’ కూడా రాబోతోంది. అటు ఫ్యామిలీతోపాటు యూత్ ను కూడా అట్రాక్ట్ చేసిన చిత్రం ‘బొమ్మరిల్లు’. ‘శతమానం భవతి’ ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైంది. యూత్ నుంచి స్పందన తక్కువగా వచ్చింది. ఇక, ఇప్పుడు వచ్చే ‘ఫ్యామిలీ స్టార్’లో అన్నిరకాల ఎమోషన్స్ ఉన్నాయి. ఇది ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో ప్రేమకథ.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. పర్టిక్యులర్ గా ఇలాంటి జానరే చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. వచ్చిన కథలు వింటా. పరశురామ్ ఫ్యామిలీ స్టార్ కథ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది. ఫుల్ స్క్రిప్ట్ కావాలని అడిగా.. నాతో సినిమా చేయాలని దిల్ రాజు ఎప్పటి నుంచో అనుకుంటున్నారని నాకు తెలుసు. అది నా అదృష్టంగా భావించా.. వెంటనే కథను ఆయనకు పంపించా.
కొవిడ్ సమయంలో నాకు డబ్బులు కాస్త ఇబ్బందిగా ఉన్నాయి. ఆ సమయంలో కూడా దిల్ రాజు అడ్వాన్స్ పంపించారు. పరశురామ్ చెప్పిన కథను విన్న ఆయన ఆ తర్వాత పరశురాంతో కలిసి ఫుల్ స్క్రిప్ట్‌తో నన్ను కలిశారు. వెంటనే ఓకే అన్నా. గౌతమ్ తిన్ననూరి, ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే, వాళ్లు అర్థం చేసుకోవడంతోనే దీన్ని త్వరగా పూర్తి చేయగలిగా.
కొన్ని ప్రశ్నలకు టీమ్ సమాధానం చెప్పింది..
ఈ మధ్య స్టేజీపై డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతున్నారు. నటుడిగా ఏమైనా ఎంట్రీ ఇస్తారా?
దిల్‌రాజు: నటుడిగా మారే ఆలోచన లేదు. ప్రేక్షకులకు చిత్రాన్ని చేరువ చేసేందుకు నా వంతు ప్రయత్నం.
స్క్రిప్ట్ వినగానే ఎవరు గుర్తుకు వచ్చారు..
విజయ్ దేవరకొండ: మా నాన్ననే గోవర్ధన్ రావు.. నాకు ‘ఫ్యామిలీ స్టార్’ ఆయనే. మేము ఏది అడిగినా కాదనలేదు. ఎంతో కష్టపడేవారు. చిన్నతనంలో హాస్టల్‌లో ఉండేవాళ్లం. వేసవి సెలవుల కోసం ఇంటికి వచ్చినప్పుడల్లా.. సైకిల్ కొనాలని విసిసించే వాడిని. ఇంటి ఖర్చులు మాకు అర్థం కావు కదా.. నాకోసం లేడీ బర్డ్ సైకిల్ సెకండ్ హ్యాండ్‌లో కొన్నారు. దీంతో నేనే వాడే వాడిని కానీ అందరికీ మా అక్క సైకిల్ అని చెప్పేవాడిని.
పెళ్లి ఎప్పుడు?
విజయ్ దేవరకొండ: ఇంకా సమయం ఉంది. తల్లిదండ్రులకు నచ్చకుండా అయితే చేసుకోను.
హీరో పాత్ర పేరు మీరే పెట్టారంటా?
విజయ్ దేవరకొండ: డైరెక్టర్ పరశురామ్ స్క్రిప్ట్‌తో వచ్చినప్పుడు నా పాత్రకు ఎలాంటి పేరు లేదు. మా నాన్న పేరునే హీరో పాత్రకు పెట్టమని అడిగా. మా నాన్నే కాదు ప్రపంచంలోని నాన్నలందరికీ ఇది అంకితం.
గీతా ఆర్ట్స్ లో పరశురామ్ ఈ సినిమా చేయాల్సింది. కానీ, మీతో చేశారు. దీనివల్ల అల్లు అరవింద్ హర్ట్ అయ్యారని వార్తలు వచ్చాయి?
దిల్‌రాజు: ఇండస్ట్రీలో అల్లు అరవింద్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. ఇది అందరికీ తెలుసిందే..
కేరింత ఆడిషన్‌కు వెళ్లారా?
విజయ్ దేవరకొండ: ‘శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్‌పై తెరకెక్కిన ‘కేరింత’ కోసం ఆడిషన్స్‌కు వెళ్లాను కానీ నన్ను సెలెక్ట్ చేయలేదు. ఆ సమయంలో బాగా హర్ట్ అయ్యా. ఇదే విషయాన్ని దిల్‌రాజుతో కూడా చెప్పా. కరెక్ట్ కథ కోసం ఎదురుచూశాం.
దిల్‌రాజు: విజయ్ దేవరకొండతో గతంలో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేశా. స్క్రిప్ట్ కూడా రెడీగా పెట్టుకున్నా.
కథ విన్న సమయంలో ఎవరు గుర్తుకువచ్చారు?
మృణాల్: మా నాన్న. మా కోసం కష్టపడ్డారు. ఇది ప్రతీ ఒక్కరికి నచ్చే చిత్రం. నేను నటించిన తెలుగు చిత్రాలు హిట్ అందుకుంటున్నాయి.. లక్ వల్లే అది సాధ్యం. లక్‌తోపాటు పాత్ర కోసం నేను శ్రమిస్తున్నా.