Venu Swamy : 2024, 2029లో జగనే సీఎం వేణు స్వామి జ్యోతిష్యం.. వైరల్ అవుతున్న వీడియో..

Venu Swamy Astrology Viral Video
Venu Swamy Viral Video : సెలబ్రెటీ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయం అవసరం లేదు. ప్రతీ సారి ఏదో ఒక వివాదంతో సెలబ్రెటీలను కంగారు పెట్టిస్తుంటాడు వేణు స్వామి. గతంలో సూపర్ స్టార్ కృష్ణ రెండో భార్య విజయ నిర్మల ఇంట్లో పూజలు, వేడుకలకు ఎక్కువగా హాజరైన ఆయన అప్పటి నుంచే సెలబ్రెటీ జ్యోతిష్యుడిగా మారిపోయాడు. సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయాలపై కూడా ఆయన చేస్తున్న కామెంట్లు సోషల్ మీడియాను సైతం షేక్ చేస్తంటాయి.
నాగ చైతన్య సమంత వివాహం, విడాకుల గురించి ముందే చెప్పిన ఆయన వారు విడిపోవడంతో మరింత పాపులర్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి ఆయన ఏది చెప్తే అదే అవుతుందని సెలబ్రెటీల మనసుల్లోకి లోతుగా వెళ్లింది. ఇక ఆ తర్వాత చాలా మంది సెలబ్రెటీల జ్యోతిష్యం అంటూ చెప్పుకచ్చాడు. చై, సామ్ డైవర్స్ నుంచి వేణు స్వామికి భారీగా క్రేజ్ వచ్చింది. నయనతారపై కూడా కామెంట్ చేశాడు. కానీ దానికి ఇంకా టైం పట్టవచ్చని చెప్పాడు. ఇప్పుడు ఏపీ రాజకీయాల గురించి చెప్పి మరింత ఆందోళనలో పడేశాడు.
ఇంకో రెండు లేదంటే మూడు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో వేణు స్వామితో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న ఓ యాంకర్ ఏపీలో ఎవరు గెలుస్తారని ప్రశ్నించింది. దీనికి ఆయన తడబడకుండా టక్కున జగన్ అని చెప్పాడు. కన్ఫ్యూజన్ అయిన యాంకర్ మరో సారి ప్రశ్నించింది. వేణు స్వామి మాత్రం ఏ మాత్రం తడపడకుండా జగన్మోహన్ రెడ్డి 2024, 2029లో రెండు దఫాలుగా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పాడు. పైగా 2024 గెలుపు తర్వాత రూలర్ గా మారుతాడని కూడా చెప్పి టీడీపీని కన్ఫ్యూజన్ లోకి నెట్టాడు.
— Inturi Ravi Kiran (@InturiKiran7) January 22, 2024