Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కు కేటాయించే శాఖలివే?

Pawan Kalyan

Minister Pawan Kalyan

Pawan Kalyan : ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు, మంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. వారితో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, విశ్రాంత చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సినీ నటులు చిరంజీవి, రజనీకాంత్ హాజరయ్యారు. పవన్‌ కల్యాణ్‌తో పాటు మరో 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేయడంతో ఇక ఆయనకు ఏ శాఖను కేటాయిస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. హోంశాఖ లేదా సినీమాటోగ్రఫీ శాఖను కేటాయిస్తారా అని ఏపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం చంద్రబాబు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. ప్రమాణస్వీకార అనంతరం తిరుపతి వెళ్లిన ఆయన అమరావతికి రాగానే మంత్రులకు కేటాయించే శాఖలపై స్పష్టత వస్తుంది. చంద్రబాబు కేబినెట్ లో జనసేనకు మూడు మంత్రి పదవులను కేటాయించారు. ఇందులో ఆయనకు దక్కే శాఖపైనే అందరి దృష్టి నెలకొంది.

పవన్ కు డిప్యూటీ సీఎంతోపాటు కీలకమైన హోంశాఖను ఇస్తారని కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే పవన్ మాత్రం తనకు గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖను కేటాయించాలని కోరినట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే పవన్ ను డిప్యూటీ సీఎం చేయడంతో పాటు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి , అటవీ, పర్యావరణ శాఖలను కేటాయించనున్నట్లు సమాచారం. జనసేనలో కీలకంగా వ్యవహరించే నాదెండ్ల మనోహర్ కు సివిల్ సప్లయ్, కందుల దుర్గేష్ కు పర్యాటకం, సినీమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్టు తెలుస్తోంది.

TAGS