Congress Lead : అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితాలు.. 5 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం
Congress Lead : దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ ఎన్నికలకు కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్ 4, హిమాచల్ ప్రదేశ్ 3, ఉత్తరాఖండ్ 2, పంజాబ్, బీహార్, తమిళనాడ్, మధ్యప్రదేశ్ లలో ఒక్కో స్థానానికి జూలై 10న ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలలో కాంగ్రెస్ 5, టీఎంసీ 4, బీజేపీ, డీఎంకే, ఆప్, జేడీయూ ఒక్కో స్థాంలో లీడింగ్ లో కొనసాగుతున్నాయి.
ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్, మంగళూర్ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. బద్రీనాథ్ లో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర భండారీపై కాంగ్రెస్ అభ్యర్థి లఖ్ పత్ సింగ్ బుటోలా 195 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, బీఎస్పీకి చెందిన ఉబెదుర్ రెహ్మాన్ పై కాంగ్రెస్ కు చెందిన ఖాజీ నిజాముద్దీన్ 1,586 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. గతంలో నిజాముద్దీన్ మూడు సార్లు గెలిచిన మంగ్లౌర్ లో బీజేపీకి చెందిన కర్తార్ సింగ్ భదానా మూడో స్థానంలో ఉన్నారు. ఆప్ కు చెందిన జలంధర్ వెస్ట్ అసెంబ్లీ ఉపఎన్నిక అభ్యర్థి మొహిందర్ భగత్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి సురీందర్ కౌర్ పై 23,000 ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు.