ASI Suicide : రైలు కిందపడి ఏఎస్సై ఆత్మహత్య

ASI Suicide
ASI Suicide : వైఎస్సార్ జిల్లా కమలాపురం ఏఎస్సై నాగార్జునరెడ్డి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. వల్లూరు మండలం తప్పెట్ల బ్రిడ్జి వద్ద రైలు పట్టాలపై పడి ఏఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కమలాపురం పోలీస్ స్టేషన్ లో ఏఎస్సైగా పని చేస్తున్న నాగార్జున రెడ్డి నైట్ డ్యూటీ ముగించుకొని తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై జిల్లా పోలీసు అధికారి సిద్ధార్థ కౌశల్ ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.