Ashwini Dutt : ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమా కల్కి. ఇండియన్ మూవీ హిస్టరీలోనే ఒక సెన్సేషన్ గా ఈ సినిమా రాబోతోంది అంటూ ఊహాగాలు వినిపిస్తున్నాయి. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ కాగా.. రిలీజ్ పనులు వేగంగా సాగుతున్నాయి.
అయితే, కల్కి సినిమా రిలీజ్ డేట్ పై బ్లూ మీడియా రకరకాల ప్రచారం చేసింది. వైజయంతీ మూవీస్ బ్యానర్ నుంచి అత్యంత ఖరీదైన బడ్జెట్ తో తెరకెక్కుతున్న‘’కల్కి’ సినిమాకు దాదాపు 500 కోట్ల వరకు వెచ్చించినట్లు ప్రొడ్యూసర్స్ చెప్తున్నారు.
పాన్ ఇండియా లెవల్ లో రాబోతున్న ఈ సినిమా మే 9న విడుదల కావాల్సి ఉండగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్లాన్ లో మార్పు వచ్చింది. అశ్వనీదత్ ఈ సినిమాను మేలో (అంటే రిజల్ట్స్ డేకి ముందే) రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఊహాగానాలు వినిపించాయి.
టీడీపీకి అనుకూలంగా ఉన్న అశ్వనీదత్ కు జగన్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, కాబట్టి ఫలితాల తర్వాత ఇలాంటి భారీ ప్రాజెక్టును విడుదల చేసే రిస్క్ తీసుకోరని అంటున్నారు. ‘గత ఐదేళ్లలో సినిమాలు ఎలా తీయవచ్చో జగన్ చూపించారు. అందుకే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే జూన్ లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్లు బ్లూ మీడియా’ కథనాలు ప్రచురించింది.
ఎన్నికల కోడ్ సమయంలో టికెట్ రేట్లపై ఎన్నికల కమిషన్ లేదా కోర్టులు నిర్ణయం తీసుకోవచ్చని వారి లాజిక్. కానీ వారి వాదనలన్నిటినీ బద్దలు కొడుతూ అశ్వినీదత్ జూన్ 27వ తేదీని రిలీజ్ డేట్ గా ప్రకటించారు. బ్లూ మీడియా లాజిక్ ప్రకారం అశ్వనీదత్ జూన్ 4న చంద్రబాబు అధికారంలోకి రావడం ఖాయమని, సినిమా విడుదల విషయంలో తొందరపడటం లేదన్నారు. అలాగే, టీడీపీ ప్రభుత్వంలో కూడా టికెట్ రేట్లు మెరుగ్గా ఉంటాయని ఆయన భావిస్తున్నారు.