Ashwini Dutt : టాలీవుడ్ పెద్దన్న, మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మరుపురాని చిత్రాల్లో ‘ఇంద్ర’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఉన్నాయి. ఈ రెండు సినిమాలను వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీ దత్ తెరకెక్కించారు. ఈ సినిమాలకు సీక్వెల్స్ కావాలని చాలా రోజులుగా డిమాండ్లు వస్తున్నాయి. అయితే వీటిపై నిర్మాత అశ్వినీదత్ స్పందించారు.
ఇంద్ర టీమ్‌కు సన్మానం
2002లో వచ్చిన ఇంద్ర బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. దీంతో ఈ మూవీని చిరంజీవి 69వ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఇంద్ర టీమ్ ను ఇంటికి పిలిచి సన్మానించారు. చిరంజీవి. ప్రొడ్యూసర్ అశ్వినీదత్ తోపాటు డైరెక్టర్ గోపాల్, రచయితలు పరుచూరి బ్రదర్స్, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, చిన్ని కృష్ణ చిరంజీవి ఇంటికి వెళ్లారు.
టీములోని అందరికీ శాలువాలు కప్పి సన్మానించారు చిరంజీవి. ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ కు ‘పాంచజన్యం’ బహుమతిగా ఇవ్వడం ఇందులో విశేషం. ‘వైజయంతీ మూవీస్’ బ్యానర్ లో సీనియర్ ఎన్టీఆర్ కృష్ణుడి వేషధారణలో ఈ పాంచజన్యాన్ని పూరిస్తూ కనిపిస్తాడు. చాన్నాళ్లుగా దీన్ని అశ్వినీదత్ కు గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నట్లు చిరు చెప్పారు.
సీక్వెల్స్ అనౌన్స్..
ఈ సన్మానం ముగిసిన వెంటనే అశ్వినీదత్ మీడియాతో మాట్లాడాడు. ఇంద్ర, జగదేక వీరుడు అతిలోక సుందరికి సీక్వెల్స్ తేవాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు. వీటి కోసం ఫ్యాన్స్ ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని, వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పాడు.
ఇంద్ర రీరిలీజ్ రికార్డులు
రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఇంద్ర చిరంజీవి కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. ఈ మూవీలో ఆయన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. డైలాగ్స్ నుంచి ఫైట్స్ వరకు ప్రతీ అంశం ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంది. రీ రిలీజ్ కూడా రికార్డులను క్రియేట్ చేసింది.
తొలి రోజు ఇండియా వైడ్‌గా రూ. 2 కోట్ల 50 లక్షలు రాబట్టింది. ఓవర్సీస్ లో 50 లక్షలకుపైగా వసూళ్లను దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇంద్ర ఒక్క నైజాంలోనే గురువారం కోటి వరకు వసూళ్లు దక్కించుక్కుంది.