Paidithalli : పైడితల్లి తొలేళ్ల సంబరాలు.. పట్టువస్త్రాలు సమర్పించిన అశోక్ గజపతిరాజు

Paidithalli, Ashok Gajapathi Raju
Paidithalli : సోమవారం ఘనంగా ప్రారంభమైంది. నగరమంతా పండగ శోభ సంతరించుకుంది. పులివేషాలు, కర్రసాము, కత్తిసాము, విచిత్ర వేషాలతో పట్టణంలో సందడి నెలకొంది. అమ్మవారికి మొక్కులు సమర్పించేందుకు భక్తులు బారులు తీరారు. ఘటాలతో, అమ్మవారి నామ స్మరణతో నగరం మారుమ్రోగింది. వివిధ ప్రాంతాల నుంచి పట్టణానికి భక్తులు తరలి వస్తున్నారు.
ఉత్సవాల్లో భాగంగా కేంద్ర మాజీ మంత్రి, ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని పట్టువస్త్రాలు సమర్పించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పూజల్లో పాల్గొన్నారు. అంతకుముందు వారందరికీ ఆలయ అధికారులు, అర్చకులు అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.