Arvind Kejriwal : జులై 3 వరకు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
Arvind Kejriwal : లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు బుధవారం పొడిగించింది. జులై 3 వరకు కస్టడీని పొడిగిస్తున్నట్లు స్పెషల్ జడ్జి నియారు బిందు ఈ మేరకు ఆదేశాలిచ్చారు. గతంలో మంజూరు చేసిన జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్‌ను కోర్టు ఎదుట హాజరుపరిచారు. విచారణ సందర్భంగా ఆయన జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను కేజ్రీవాల్ తరపు న్యాయవాది వ్యతిరేకించారు. ఆయన కస్టడీని పొడిగించడానికి ఎటువంటి ఆధారాలు లేవని అన్నారు.
అయితే, కేజ్రీవాల్ తో పాటు ఈ కేసులో నిందితుడిగా ఉన్న వినోద్ చౌహాన్ కస్టడీని కూడా కోర్టు జులై 3 వరకు పొడిగించింది. లిక్కర్ స్కామ్ లో ప్రతి అంశం చివరకు కేజ్రీవాల్ కే ముడిపడి ఉంటోందని కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్ వీ రాజు కోర్టు ముందు వాదనలు వినిపించారు.