Arvind Kejriwal : పీఎం నరేంద్ర మోదీ మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించి మెట్రోను ఇబ్బందుల్లో పడేశారని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసమే ఇలంటి స్కీంలు కొన్ని పార్టీలు తీసుకొస్తున్నాయంటూ విమర్శించారు. ఈ స్కీంతో 50 శాతం మహిళా ప్రయాణికులను మెట్రో కోల్పోతుందని మోదీ చెప్పారు. అయితే, మహిళలకు ఫ్రీ బస్సు స్కీం ప్రధానికి ఇష్టం లేదని ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రధానితో పాటు ఆయన మంత్రలు ఫ్రీగా విమానాల్లో తిరిగితే తప్పు లేదు కానీ మహిళలకు ఫ్రీ బస్సు సర్వీసు అందిస్తే మోదీ ఇష్టపడడం లేదన్నారు.
మహిళలకు ఫ్రీ బస్సు స్కీం 4 రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతోంది. ఢిల్లీ, తమిళనాడు, కర్నాటక, తెలంగాణలోనూ మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం ఉందన్నారు. ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ కూడా ఎన్నికల్లో గెలిస్తే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టిందని అన్నారు. మహిళలకు ఫ్రీబస్ సర్వీసుతో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ మెట్రోటో రద్దీ తగ్గలేదు. మెట్రోల్లో రద్దీకి తగ్గట్లుగా బోగీల సంఖ్య పెంచాలనే డిమాండ్లు పెరుగుతున్నాయని ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.