JAISW News Telugu

Arunachalam : అరుణాచలం గిరి ప్రదక్షిణ 14కి.మీ. నడవలేని వాళ్ళు ఎం చెయ్యాలి?

Arunachalam

Arunachalam

ప్రశ్న : అరుణాచలం గిరి ప్రదక్షిణ 14కి.మీ. నడవలేని వాళ్ళు ఎం చెయ్యాలి?

నేను 1కి.మీ. అయితే నడవగలను అంతకు మిం చి మా వల్ల కాదు అండీ మా ఆరోగ్యరీత్యా అంత దూరం ప్రయాణం చేయలేము మాకు ఆ ప్రదక్షిణ ఫలితం దక్కదా అని బాధపడేవాళ్ళు ఏం చెయ్యాలి?

సమాధానం : అరుణాచలం ప్రదక్షిణ కాలికి ఆప రేషన్ చేసి మీరు నడవలేరు ఎక్కువ దూరం అన్న వాళ్ళు కూడా 14కి.మీ. ఆ అరుణాచలే శ్వరుడి అనుగ్రహముతో గిరి ప్రదక్షిణ చేస్తున్నారు ఇప్పటికీ కూడా చేస్తుంటారు.శతవిధాలా ప్రదక్షిణ చెయ్యడానికి ప్రయత్నించండి.

ఇంకా ఆరోగ్యరీత్యా నా వల్ల అవ్వదు అనుకునే వాళ్లు అరుణాచలం ప్రధాన దేవాలయం అదే అగ్ని లింగం ఉండే ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు అరుణాచలేశ్వరుడి నామ స్మరణ చేస్తూ చేసినా అదే ఫలితం వస్తుంది అని భగవాన్ రమణ మహర్షి చెప్పారు. ఇది శాస్త్రంలో కూడా చెప్పబడింది.

లేదండీ ఇది కూడా మా వల్ల అవ్వదు అనుకుంటే అరుణాచలం గర్భాలయం వెనుక వైపు పేయి గోపురం ఉంటుంది దానిలో నుంచి వస్తుంటే మీకు కుడి వైపు ఒక గేట్ కనిపిస్తుంది(ఇది గర్భాలయం వెనుక పేయి గోపురం మధ్యలో ఉంటుంది) ఆ గేట్ తీసి లోపలికి వెళ్తే ఒక చిన్న మండపంలో ఈ క్రింది ఫొటోలో ఉన్న పాదాలు కనిపిస్తాయి.అవి సాక్షాత్తు అరుణాచలేశ్వరుడి పాదాలు వాటికి నమస్కారం చేసుకుని నామ స్మరణ చేసుకుంటూ మూడు ప్రదక్షిణలు చేస్తే అరుణాచలం గిరి ప్రదక్షిణ ఫలితం వస్తుందని పెద్దలు చెప్తారు.ఇవి ప్రదక్షిణ ఫలితం కావాలి అనుకునే వారికోసం మాత్రమే.

అరుణగిరికి ప్రదక్షిణ చెయ్యలేని వాళ్ళు వీటికి చేసుకోవడం ఉత్తమం..

కానీ జీవితంలో ఒక్కసారైనా అరుణగిరికి పాదచా రియై ప్రదక్షిణ చేస్తుంటే అస్సలు ఆ ప్రశాంతత, ఆనందం(ప్రదక్షిణ ఫలితం దేవుడెరుగు) వర్ణించ డం ఎవ్వరికీ సాధ్యం కాదు.మనస్సు చిందులే స్తుంది అంతే.ఈ ఆనందం,ప్రశాంతత కోసమే చాలామంది ప్రదక్షిణ ఖచ్చితంగా నియ మం పెట్టుకుని చేస్తుంటారు.అందుకే విశ్వ ప్రయత్నం చేసైనా సరే అరుణగిరికి ఒక్క ప్రదక్షిణ చెయ్యాలి అంటారు అంత అద్భుతంగా ఉంటుంది. చాలా మంది ఈ ప్రదక్షిణ కోసం జీవితాలు జీవితా లు ఇచ్చేస్తున్నారంటే అది అతిశయోక్తి కాదు.

ఆ ప్రదక్షిణ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే

అది అమోఘం,

అపూర్వం,

అనంతం,

చిత్ ప్రకాశం,

సచ్చిదానందం,

సకల మంత్ర స్వరూపం,

సకల మంగళ దాయకం,

సర్వ సమ్మోహనం,

సకలము మోక్షసిద్ది.

 ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ:

Exit mobile version