JAISW News Telugu

Prudhvi Raj : సినీనటుడు పృథ్వీరాజ్ కు అరెస్టు వారెంట్ జారీ

Prudhvi Raj

Prudhvi Raj

Prudhvi Raj : భార్యకు మనోవర్తి చెల్లింపు కేసులో న్యాయస్థానం ఎదుట గైర్హాజరైన సినీ నటుడు పృథ్వీరాజ్ పై విజయవాడ ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది.  పృథ్వీకి, ఆయన భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మికి మధ్య గత కొంతకాలంగా విబేధాలు ఉన్నాయి. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించగా.. శ్రీలక్ష్మికి నెలకు రూ.8 లక్షలు చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది.

అయితే ఈ ఆదేశాలను పాటించని పృథ్వీ.. ఈ కేసును హైకోర్టులో సవాలు చేశారు. కేసును పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం పృథ్వీకి తాత్కాలిక ఉపశమనం కల్పిస్తూ భార్యకు నెలకు రూ.22వేల చొప్పున చెల్లించాలని ఆదేశించింది. అయితే, పృథ్వీ రాజ్ హైకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయలేదు. దీంతో భార్య శ్రీలక్ష్మి తన న్యాయవాదులతో తిరిగి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన జడ్జి బుధవారం పృథ్వీ రాజ్‌ కు నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్ వారెంటు జారీ చేశారు.

Exit mobile version