Anantapur : అనంతపురంలో టెక్కీ అరెస్ట్.. ఆ ఉగ్ర పేలుళ్లతో సంబంధం నేపథ్యంలోనే?

Anantapur

Anantapur

Anantapur : భారత్ లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆవిర్భించినప్పటి నుంచి (2014) ఉగ్రదాడులు దాదాపు ఆగిపోయాయని (పుల్వామా తప్ప) చెప్పవచ్చు. కానీ ఇటీవల బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో జరిగిన బాంబు పేలుడు ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయా? ఈ నేపథ్యంలోనే బాంబులు పేలాయా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇటీవల బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో జరిగిన పేలుడు భారత్ లో మరోసారి ఉగ్రవాద భయాలను రేకెత్తించింది. ఈ ఘటన జరిగినప్పటి నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు నిఘా పెంచుతూ అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం టెక్కీకి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.

ఆయనను ఇటీవల ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సోహెల్ బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. ఆయన స్వస్థలం అనంతపురం జిల్లా రాయదుర్గం. సోహెల్ కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని, ఆయన ఎస్‌బీఐ ఖాతాలోకి ఇటీవల పెద్ద మొత్తంలో డబ్బు వచ్చినట్లు ఎన్ఐఏ అధికారులకు సమాచారం అందింది.

రాయదుర్గం ఆత్మకూరు వీధిలో ఉన్న సోహెల్ ఇంటిపై ఎన్ఐఏ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సోహెల్, అతని తండ్రి అబ్దుల్, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇటీవల సోహెల్ బ్యాంకు ఖాతాలోకి వచ్చిన మొత్తం గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. విచారణ అనంతరం అధికారులు సోహెల్ ను అదుపులోకి తీసుకొని రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉగ్రవాదులతో సోహెల్ కు ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.  

TAGS