Pakistan Team : పాక్ జట్టుకు ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చి వేస్ట్
Pakistan Team : పాకిస్థాన్ క్రికెట్ జట్టు అంటే పాక్ లో చాలా క్రేజ్ ఉంటుంది. అలాంటి పాకిస్థాన్ జట్టు 2023 వరల్డ్ కప్ లో లీగ్ స్టేజ్ లోనే ఇంటి బాట పట్టింది. భారత్ లో పాక్ ఓడిపోవడం చూసి అక్కడి మాజీ క్రికెటర్లు, అభిమానులు తట్టుకోలేకపోయారు. పాక్ గ్రూపు స్టేజిలోనే బయటకు వచ్చేయడంతో వెంటనే టీంను ప్రక్షాళన చేయాలనుకున్నారు.
కెప్టెన్ గా బాబర్ అజాం వరల్డ్ కప్ ఓటమికి తానే కారణమని తప్పుకున్నాడు. తర్వాత మూడు పార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లను పాక్ క్రికెట్ బోర్డు నియమించింది. అయితే ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లిన పాక్ టెస్టు సిరీస్ ను 3-0 కోల్పోయి పరువు పోగొట్టుకుంది. అనంతరం పాక్ క్రికెట్ బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ క్రికెట్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
పాకిస్థాన్ క్రీడాకారులు గ్రౌండ్ లో పరుగెత్తలేకపోతున్నారని పాక్ ఆర్మీ అధికారులతో శిక్షణ ఇప్పించారు. కీలక సమయాల్లో ఎలా స్పందించాలో అన్ని రకాల శిక్షణ ఇప్పించారు. గ్రౌండ్ లో చురుగ్గా వ్యవహరించడమే కాకుండా అన్ని రకాలుగా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ శిక్షణ కోసం టీ 20 వరల్డ్ కప్ కు వెళ్లే జట్టును తీసుకుని వారందరికీ శిక్షణ ఇచ్చారు.
అయితే ఇంత శిక్షణ ఇచ్చినా కూడా బూడిదలో పోసిన పన్నీరే అయింది. పాకిస్థాన్ తన స్వదేశంలో న్యూజిలాండ్ తో 5 టీం మ్యాచ్ ల సిరీస్ ఆడుతోంది. అందులో మొదటి మ్యాచ్ వర్షంతో రద్దు కాగా.. రెండో మ్యాచ్ పాక్ గెలిచింది. మూడో, నాలుగో మ్యాచుల్లో న్యూజిలాండ్ గెలిచి 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. అయితే న్యూజిలాండ్ తన బీ టీంతో ఆడుతోంది. రచిన్ రవీంద్ర, డారెల్ మిచెల్ , కేన్ విలియమ్ సన్, మ్యాథ్ హెన్రీ, బౌల్ట్ ఇలా స్టార్ ప్లేయర్లందరూ ఐపీఎల్ లో ఉన్నారు. అయినా కూడా పాకిస్థాన్ జట్టు న్యూజిలాండ్ బీ టీంను సొంతగడ్డపై ఓడించలేక తంటాలు పడుతోంది. చివరి మ్యాచ్ లో కూడా ఓడిపోతే సిరీస్ పోగొట్టుకోవడమే కాకుండా.. వరల్డ్ కప్ కు వెళ్లేముందు ఇబ్బంది పడే అవకాశం ఉంది.