Vishwak Controversy : మళ్లీ తెరపైకి అర్జున్-విశ్వక్ వివాదం.. బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలైతే ఇలానే చేసేవారా? అంటూ..

Vishwak Controversy
Vishwak Controversy : వెటరన్ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్, టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కాంబినేషన్ లో ఓ సినిమా ప్లాన్ చేసి మొదట్లోనే ఆగిపోయి రచ్చరచ్చ అయ్యింది గుర్తుంది కదా.. అర్జున్ ప్రత్యేక ప్రెస్ మీట్ పెట్టి మరీ విశ్వక్ సేన్ పై విమర్శలు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా ఆ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. విశ్వక్ సేన్ హీరోగా కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో రూపొందిన ప్రయోగాత్మక సినిమా ‘గామి’ మార్చి 8న రిలీజ్ కానుంది. దీంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ ముమ్మరం చేసింది.
గామి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న హీరో విశ్వక్ సేన్ అర్జున్ సినిమా విషయంలో నెలకొన్న వివాదంపై క్లారిటీ ఇచ్చాడు. ఆ సినిమా విషయంలో అర్జున్ చేసిన కామెంట్స్ వల్ల తానే ఎక్కువ నష్టపోయాయని, ఆ సినిమాను ఆపేయమని, క్యాన్సిల్ చేయమని తానెన్నడూ అడగలేదని, ఒకరోజు షూటింగ్ మాత్రమే ఆపమని కోరానని అన్నాడు. ఆ సమయంలో అర్జున్ తమ ఇంటికి వచ్చి పేరెంట్స్ ను ప్రాధేయపడడం వంటివి చాలా జరిగాయని, తీసుకున్న రెమ్యూనరేషన్ కంటే రెట్టింపు సొమ్ము అర్జున్ కు తిరిగి ఇచ్చానని, అలాంటివి నేను బయటపెట్టలేదని అన్నాడు.
ఈ విషయంలో ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నాడు. ఇదే ఇన్సిడెంట్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోల విషయంలో జరిగితే ఏమయ్యేదని ప్రశ్నించాడు. తనకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు కాబట్టే అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ అలాంటి కామెంట్స్ చేశారని చెప్పుకొచ్చాడు.