Ariyana Glory : వారెవ్వా అప్పట్లో ఏమందంరా బాబోయ్.. ఇప్పుడు కూడా తగ్గేదేలే అంటున్న బ్యూటీ
Ariyana Glory : ఒకే ఒక్క ఇంటర్వ్యూతో ఎంతో మంది సెలబ్రేటీలుగా మారిపోతున్నారు. ఓవర్ నైట్ స్టార్ లుగా మారిపోతున్నారు. రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి ఒక్క రోజులోనే సెలబ్రేటీ అయిపోయింది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ పేరు చెబితే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు.
బుల్లితెరపై యాంకర్ గా, బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పని చేసి గుర్తింపు పొందింది. ముఖ్యంగా కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఈ గ్లామర్ క్వీన్ ఫొటోలు నెట్టింట ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి.
హిరోయిన్లకు తీసిపోని ఈ భామ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇంతకీ ఆమె ఎవరో కాదు అరియానా గ్లోరీ.. బిగ్ బాస్ సీజన్ 4 లో తన గ్రేట్ ఫర్ఫామెన్స్ తో టాప్ 5 లో నిలిచింది. ఈమె చూస్తే చిన్న వయసు ఉన్నట్లు కనిపించినా.. పెద్ద తలకాయలనే ఇంటర్వ్యూ చేసి ఫేమస్ అయింది. రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ వల్ల తన తలరాతనే మార్చేసుకుంది.
అయితే ఈ ముద్దుగుమ్మ చిన్నప్పటి ఫొటో వైరల్ కావడంతో నెటిజన్లు చాలా మంది గుర్తు పట్టడం లేదంటా.. కాసేపు చూసిన తర్వాత గుర్తుపట్టి అరియానా గ్లోరీ చిన్నప్పుడు ఇంత అందంగా ఉందా అని నోరెళ్ల బెడుతున్నారు.
అరియానా అసలు పేరు మంగలి అర్చన కాగా 2015లో ఓ యూట్యూబ్ ఛానెల్ యాంకర్‌గా తన కెరీర్
ను స్టార్ట్ చేసింది. ‘బీబీ జోడి’ షోలో కమెడియన్ అవినాష్‌తో కలిసి డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో తన అంద చందాలతో మతి పోగొట్టే ఈ ముద్దుగుమ్మ.. ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండాలని కోరుకుంటుంది. దీని కోసం ఇన్ స్టా గ్రాంలో ఎప్పుడు ఏవో ఒక ఫొటోలు పెడుతూనే ఉంటుంది. ఈమెకు ఇన్ స్టాగ్రాంలో బోలెడంతా మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.