Kavitha Bail : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్యే కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ కేసులో వాదనలను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది. ఈడీ అరెస్టు చేసిన విధానం, కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కవిత తరపున న్యాయవాది కోర్టుకు వివరించారు. దీనికి సంబంధించి ఆదివారం సాయంత్రం లోపు కౌంటర్ కాపీని కవిత న్యాయవాదికి మెయిల్ ద్వారా ఇవ్వాలని ఈడీ, సీబీఐని హైకోర్టు ఆదేశించింది.
సోమవారం నాడు రెండు కేసుల్లో కవిత తరపు వాదనలు పూర్తి చేయాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది. మంగళవారం ఈడీ, సీబీఐ వాదనలు వింటామని న్యాయమూర్తి అన్నారు. అనంతరం కవిత బెయిల్ పిటిషన్ పై శనివారం నాడు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తామని సీబీఐ తరపు న్యాయవాది తెలిపారు.