Avenue Court : కవిత అరెస్ట్ పై రౌస్ అవెన్యూ కోర్టు లో వాడీ వేడి వాదనలు సాగుతున్నాయి. కవిత తరుపున సీని యర్ లాయర్ విక్రమ్ చౌదరి, ఈడీ తరుపున ఎన్. కే. మట్టా, హుస్సేన్ వాదనలు వినిపిస్తున్నారు.
కవితను విచారించేందుకు 10 రోజుల కస్టడీ కి ఇవ్వాలని ఈడి తరపు న్యాయవాదులు కోరుతు న్నారు. మరో వైపు ఇది అక్రమ అరెస్ట్ అని, బెయి ల్ ఇవ్వాలని కవిత తరుపు న్యాయవాది వాదిస్తు న్నారు. కవిత తో మాట్లాడేoదుకు మాకు 5 నిమి షాలు అవకాశం ఇవ్వాలని ఆమె తరుపు జడ్జిని కోరగా జడ్జి అనుమతి ఇచ్చారు.
మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత ను ఈడి అధికారులు అరెస్ట్ చేయడం వల్ల రాజకీ యాలు వేడెక్కాయి. మరో వైపు ఎమ్మెల్సీ కవిత ను అక్రమంగా అరెస్ట్ చేశారనీ BRS నేతలు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన లు చేపట్టారు.