JAISW News Telugu

KCR Petition : కేసీఆర్ పిటిషన్ పై ముగిసిన వాదనలు.. హైకోర్టు తీర్పు రిజర్వ్

KCR Petition

KCR Petition High court judgment

KCR Petition : విద్యుత్ కొనుగోళ్ల విచారణపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలన్న కేసీఆర్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ లో పెట్టింది హైకోర్టు. ఈరోజు లేదా జూలై 1న తీర్పును వెల్లడిస్తామని తెలిపింది.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి ఎంక్వైరీ కమిషన్ ను రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను ఈరోజు శుక్రవారం మరోసారి హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు.

విద్యుత్ కొనుగోలుపై ఎంక్వయిరీ చేయాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. ఎంక్వయిరీ వేయాలని వారే చెప్పినప్పుడు ఈ కమిషన్ ఏకపక్షం ఎలా అవుతుంది. జస్టిస్ నరసింహారెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ లో ఎక్కడ నిర్ణయానికి వచ్చినట్లు మాట్లాడలేదు. నిబంధనల ప్రకారమే రెండుసార్లు నోటీసులు ఇచ్చాము. విద్యుత్ కొనుగోలు వ్యవహారంపై పబ్లిక్ నోటీస్ సైతం జారీ చేశాం. ఇందులో విచారణ మొత్తం ఓపెన్ గా జరుగుతోంది. ఇప్పటి వరకు 15 మంది నుంచి వివరాలు సేకరించాం. 15 మందిలో మాజీ సీఎండీ ప్రభాకర్ రావుతో పాటు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఉన్నారు. ప్రభాకర్ రావు తో పాటు జగదీశ్ రెడ్డి కమిషన్ ముందు హాజరయ్యారు. నిబంధనల ప్రకారమే ఎంక్వయిరీ కమిషన్ యాక్ట్ 8(బి) కింద నోటీసులు జారీ చేశాం. కేసీఆర్ వద్ద ఉన్న ఎవిడెన్స్ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నామని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టుకు వాదనలు వినిపించారు.

ముందుగా జూన్ 27న కేసీఆర్ తరపున సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ ఆదిత్య సోంధి వాదనలు వినిపించారు. జూన్ 30తో ఎంక్వయిరీ కమిషన్ గడువు ముగుస్తుందని, ఈలోగా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని, కాబట్టి కమిషన్ విచారణపై స్టే ఇవ్వాలని కోరారు. పిటిషన్ కు నంబర్ కేటాయించాక శుక్రవారం విచారణ చేస్తాం. అన్ని అంశాలను పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. దీంతో పిటిషన్ కు నంబర్ కేటాయించాలని ఆదిత్ సోంధి కోరారు. దీంతో ఈరోజు (శుక్రవారం) ప్రభుత్వ తరపు వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ లో పెట్టింది. ఇవాళ కానీ.. జూలై 1న కానీ తీర్పును వెల్లడిస్తామని తెలిపింది.

Exit mobile version